మీరు చదివింది మరిచిపోతున్నారా…? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి…!

-

సహజంగా చాలా మంది విద్యార్థులు చదివినది మరచి పోతూంటారు. ఈ సమస్య చాలా మంది లో ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నా లేదా ప్రిపరేషన్ చేస్తున్నా కూడా ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు చదివినది ఎలా గుర్తుపెట్టుకోవాలి..? ఈ విషయం పై అనేక టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మరి చూసేసి అనుసరించండి.

విద్యార్థి చదివింది జ్ఞాపకం ఉండాలంటే ముందుగా ఏకాగ్రత ప్రధమం. విద్యార్థికి కనుక ఏకాగ్రత లోపిస్తే ఎన్ని సార్లు చదివినా.. ఎంత సేపు చదివినా…. అది మెదడుకి ఎక్కదు. అయితే విద్యార్థి జ్ఞాపక శక్తి మెరుగు పడాలి. ఇది మెరుగు పడాలంటే ఏకాగ్రతకు భంగం కలగని ప్రదేశాన్ని చదువు కోసం ఎంచుకోవాలి. అలానే మంచి గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. దాంతో పాటు స్టడీ రూం లోకి అందరు ప్రవేశించేలా ఉండకూడదు.

స్టడీ రూమ్ లో చదువుకునేందుకు కావాల్సిన పుస్తకాలు, రైటింగ్‌ ప్యాడ్, వాటర్ బాటిల్…. ఇలా కావాల్సిన వాటిని దగ్గరే ఉంచుకోవాలి. ఇంట్లో కలిగే పెద్ద పెద్ద సౌండ్లు విద్యార్థిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కనుక శాంతంగా, కామ్ గా ఉండాలి చదివే ప్రదేశం. చదివేది తలకి ఎక్కని వారు ఈ మార్పులని చేసి చూడండి. ఫిజికల్ సెట్టింగ్ బాగుంటే మీరు చదివేది తలకెక్కొచ్చు ఓ సరి ప్రయత్నం చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news