క్రియేటివిటీని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

-

ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే క్రియేటివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మనల్ని ఎమోషనల్ గా, మానసికంగా కూడా ఎఫెక్ట్ చేస్తుందని అంటున్నారు. అయితే మనం మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు సరిగా పని చేస్తుందని… మెదడు సరిగా పని చేస్తేనే క్రియేటివిటీ ఉంటుందని చెప్తున్నారు.’

అలానే మన గట్ హెల్త్ కి మరియు మన మెదడు పని తీరు కి సంబంధం ఉందని… ఇలా మనం తీసుకునే ఆహారం వల్ల మెదడు పనితీరు బాగుంటుందని దీనితో క్రియేటివిటీ కూడా దీని మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు. ఇక క్రియేటివిటీ పెంచే ఆహార పదార్థాలు గురించి చూద్దాం..!

మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం అలానే ధాన్యాలు, ఓట్స్, విటమిన్ బి లాంటివి కూడా బ్రెయిన్ పవర్ ని పెంచుతాయి. తద్వారా క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.

ఓట్స్:

ఓట్స్ విటమిన్ బి6, ప్రోటీన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఇస్తాయి. దీనితో బ్రెయిన్ పవర్ కూడా పెంచుకోవచ్చు.

బ్రౌన్ రైస్:

రైబోఫ్లెవిన్ లాంటి విటమిన్-డి ఇందులో ఉంటుంది. వీటి ద్వారా 20 శాతం ఆక్సిజన్ బ్రెయిన్ కి సప్లై అవుతుంది.

గుడ్లు:

న్యూరో ట్రాన్స్మిటర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇవి బాగా సహాయ పడుతాయి. గుడ్లు తీసుకోవడం వల్ల మెమరీ పవర్ ను పెంచుకోవచ్చు మరియు బ్రెయిన్ స్పీడ్ గా ఉంటుంది.

ఎక్కువగా పండ్లు తీసుకోండి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కూడా క్రియేటివిటీని పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ తీసుకోవడం వల్ల క్రియేటివిటీని పెంచుకోవడానికి వీలుందని నిపుణులు చెబుతున్నారు. అలానే అవకాడో, గుమ్మడి గింజలు కూడా క్రియేటివిటీని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news