నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో బీజేపీ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకుండా నాగార్జునసాగర్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచారం చేసారు. ఇక కొంతమంది నేతలు మండలాల వారీగా గ్రామాల వారీగా పాదయాత్రలో కూడా చేస్తున్నారు. ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు అక్కడ పార్టీ విజయం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.
ఇక కొంతమంది సీటు ఆశించే విషయంలో కూడా గట్టిగానే పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎలాగైనా పోటీ చేస్తాను అంటూ కొంతమంది నేతలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యా గిరిజన సామాజిక వర్గానికి నాగార్జునసాగర్ సీటు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ విషయంలో బీజేపీ నేతలకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారని సమాచారం.
అయితే కొంతమంది నేతలు ఆయన మీద సీరియస్ గా ఉన్నారని కూడా తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అగ్రనేతలతో ఇప్పుడు తమకు సీటు కావాలని తమ పార్టీ బలోపేతం కోసం నాగార్జునసాగర్ ఎన్నిక వస్తుందని తెలిసినప్పటినుంచి కష్టపడుతున్నామని గత ఎన్నికల్లో కూడా పార్టీ విజయం కోసం కష్టపడ్డామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి బండి సంజయ్ ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనేది చూడాలి.