సెక్స్ కి సంబంధించిన చాలా విషయాలని ఎంతో మంది పట్టించుకోరు. ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. సిగ్గు పడుతూ ఉంటే సమస్య పెద్దదై పోతుంది అని గ్రహించాలి. సెక్సువల్ హెల్త్ గురించి సీరియస్ గా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఎందుకంటే ఇది శారీరిక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుందని అంటున్నారు. చాలా దేశాలలో సెక్సువల్ హెల్త్ గురించి మాట్లాడరు. ఇండియాలో కూడా సెక్సువల్ హెల్త్ గురించి ఎక్కువగా చెప్పుకోరు. అయితే సరైన సమయానికి వైద్యం తీసుకుంటేనే వైద్యం చేయవచ్చని డాక్టర్లు అంటున్నారు.
ఇన్ ఫర్టిలిటీ సమస్యలు,సెక్సువల్ హెల్త్ కి సంబంధించిన సమస్యలు వస్తే మంచి డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యాలని వైద్యులు అంటున్నారు. ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవని వాటిని పరిష్కరించుకోవచ్చని అంటున్నారు వైద్యులు.
అకాల స్ఖలనం(premature ejaculation):
ఈ సమస్య ఎక్కువగా యువతలో కనబడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా ఏ వయసు వారికైనా ఈ సమస్య వస్తుందని కూడా చెబుతున్నారు యూరో ఆండ్రాలజిస్ట్లు.
ఈ premature ejaculation అనేది అంగస్తంభన రావడానికి లక్షణాలు అని కూడా అంటున్నారు. అదే విధంగా ఇది ఎక్కువగా యువతలో ఉంటుందని అన్నారు. ఒక్కోసారి ఏ వయసు వారికైనా వస్తుందని అన్నారు.
సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోవడం:
కొంత మంది పురుషుల్లో కోరిక తగ్గుతుంది. అయితే దీనికి గల కారణాలు చూసినట్లయితే.. టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం వల్ల సెక్స్ పైన ఆసక్తి తగ్గిపోతుంది.
డిప్రెషన్, యాంగ్జైటీ రిలేషన్ షిప్ లో ఇబ్బందులు వల్ల టెస్టోస్టెరోన్ తగ్గిపోవచ్చు అని డాక్టర్లు అంటున్నారు. అదే విధంగా డయాబెటిస్, హై బీపీ, యాంటీ డిప్రెసంట్స్ ట్రీట్మెంట్స్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది.
ఇంఫెర్టిలిటీ:
పురుషుల్లో కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. దీని కారణంగా ప్రెగ్నెంట్ అవ్వలేరు. హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం, సెక్సువల్ డిస్ ఫంక్షన్, varicocele వంటి కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
అంగస్తంభనం:
సెక్స్ లో పాల్గొనడానికి కష్టంగా ఉన్నా లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు మరేదైనా సమస్య ఉన్నా అంగస్తంభనం సమస్య వుండే ఛాన్స్ ఉండి. అనేక సందర్భాల్లో శారీరక స్థితి, వాస్కులర్ డిసీజ్, థైరాయిడ్ క్షీణత, డయాబెటిస్ మరియు రక్తపోటుతో లింక్ అయ్యి ఉంటుంది.