డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!

-

వేసవి తాపాన్ని తగ్గించడానికి అందరు ఈ రోజుల్లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. రోడ్ల పై ఉండే జ్యూస్ షాప్ లు కూడా ఈ రోజులు వస్తే రద్దీ గా ఉండేవి. కాని ఇప్పుడు కరోనా గురించి దేశం మొత్తం లాక్ డౌన్ పాటించటం వల్ల ఇలాంటివి రోడ్ల పై కనుమరుగయ్యాయి. అందుకే మనం ఇంట్లోనే ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్ లను తయారు చేసుకుందాం. కరోనా ని ఎదుర్కునే వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉండే నిమ్మ, పుదీనా డ్రింక్ తయారీ చూద్దాం.

నిమ్మ, పుదీనా డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు: 500ml నీళ్లు
1 కప్పు_ తాజా పుదీనా ఆకులు
2 స్పూన్లు_ తాజా నిమ్మరసం
ఉప్పు_ కొద్దిగా
½ కప్పు_ ఐస్ ముక్కలు

ఈ డ్రింక్ తయారీ చేయు విధానం: పుదీనా ఆకులు మిక్సి లో వేసి మెత్తని పేస్ట్ సిద్దం చేసుకోవాలి. దీనిలో అర కప్పు నీరు పోసి పుదీనా పేస్ట్ ని మిక్సీ పట్టాలి. దీని వడకట్టి దానిలో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీనిలో ఐస్ ముక్కలు వేసి పుదీనా రసాన్ని జ్యూస్ గ్లాసుల్లో నీళ్లు పోసి  కలపాలి. అంతే నిమ్మ, పుదీనా డ్రింక్ సిద్దం అయినట్లే. అయితే ఇది ఎక్కువ కూలింగ్ లేకుండా చూసుకోవాలి.  అతి దాహం అయినప్పుడు ఇది చక్కటి ఉపశమనం.

Read more RELATED
Recommended to you

Latest news