రక్తహీనత సమస్యతో బాధపడే వారికి శుభవార్త..!!

-

ఈ కాలంలో రక్తహీనత అనేది ఆడవారిలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో గాని,ఆడవాళ్లుకు గాని రక్తహీనత అనేది ఆరోగ్య పరంగా చాలా దుష్పలితాలనిస్తోంది. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వారికి రోజంతా నీరసంగా ఉండటం, ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతుంటారు. రక్తహీనత అనేది పిల్లల్లో సరిగా తినకపోవడం వల్ల ,శరీరానికి శ్రమ లేకుండా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన మోతాదులో హిమోగ్లోబిన్ అందకుండా పోతోంది. మహిళల్లో అయితే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల.. నెలసరి సమస్యల వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతూ ఉంటుంది . ఈ రక్తహీనతను తగ్గించుకోవడానికి డాక్టర్లు అనేక కృత్రిమ మందులను ఇస్తూ,అదేవిధంగా కూరగాయలను.. ఆకుకూరలను క్రమము తప్పకుండా తినమని చెబుతుంటారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలలో ముఖ్యంగా బీరకాయ గురించి తెలియని వారు ఉండరు. కానీ అందులో ఉండే పోషకాలు గురించి అందరికీ అవగాహన ఉండదు. బీరకాయని చాలా రకాల వంటకాల్లో వాడుతూ ఉంటాము. బీరకాయతో పచ్చడి, పప్పు, బీరకాయ కర్రీ లాగా చేసుకొని తింటూ ఉంటాము. బీరకాయ వల్ల శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. బీరకాయ కి చలువ చేసే గుణం ఉండడం వల్ల మన శరీరంలో ఉండే వేడిని తీసివేస్తుంది. అదే విధముగా మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయం చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది . అందువలన అనారోగ్యం కలిగిన వాళ్లకి బీరకాయలు పత్యము రూపంలో ఇస్తూ ఉంటారు. వారికి అనారోగ్యం వలన శరీరంలో జీవక్రియలు సరిగా జరగవు. ఆ సమయంలో బీరకాయ వంటివి తొందరగా జీర్ణమయ్యే పదార్థాలను ఇవ్వాలి. బీరకాయ లో ఉండే పోషకాలు తెలిస్తే బీరకాయ అస్సలు వదలరు.

బీరకాయ లో విటమిన్ ఏ, సి, క్యాల్సియం,ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జ్వరం వచ్చిన వారికి తగ్గిన తర్వాత బీరకాయ పొట్టు తో చేసే పచ్చడి ,కూర పెడితే వాళ్ళకి తక్షణమే శక్తి వచ్చి కోలుకుంటారు. బీరకాయ కి కాలేయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. యాంటీఇన్ఫ్లమేటరీ గా పనిచేసి,చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులు రాకుండాను నివారిస్తుంది. రక్తాన్ని శుభ్రపరిచి, ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు రక్తహీనతను తగ్గిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news