చెవి ఇన్‌ఫెక్షన్‌కు వెల్లుల్లితో చక్కటి పరిష్కారం..! రిజల్ట్‌ పక్కా..!

-

చిన్నపిల్లలు త్వరగా జబ్బుల భారిన పడతారు. ఇన్‌ఫెక్షన్లు అందిరిలో ఒకేలాగా ఉండవు..చెవినొప్పి, వికారం, నిద్రపట్టకపోవడం, తలనొప్పి ఇలా చాలా సమస్యలు పిల్లల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే శిశువుల్లో చెవిలోంచి చీమి కారడంలా చూస్తుంటాం. ఇలాంటి సమస్యలకు కారణాలు, తగ్గించుకునే మార్గాలు చూద్దామా..!

చెవి ఇన్‌ఫెక్షన్‌కి కారణం..

పోషకాహార లోపం, అంతర్గత గాయాలు, పర్యావరణ సంబంధిత ఎలర్జీలు, అడినాయిడ్ గ్రంధుల వాపు, ఇంఫెక్షన్లు, సైనస్ ఇంఫెక్షన్లు, జలుబు, శ్వాశ కోశ ఇన్ ఫెక్షన్లు, చెవిలో గులిమి పేరుకుపోవడం లాంటివి చెవి ఇన్ ఫెక్షన్లకి కారణంగా చెప్పవచ్చు.

పరిష్కరించుకునే మార్గాలు..

చెవి నొప్పిని తగ్గించుకోవడానికి వెల్లుల్లి ఎంతో ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడైజ్డ్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్‌కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

ముందుగా 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి.. అందులో వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించాలి. కొద్దిసేపటి తరువాత ఉడికిన వెల్లుల్లిని క్లాత్‌లో వేసి, కొద్దిగా ఉప్పును వేసి నొప్పి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మెల్లగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల చెవి నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు.

అలాగే వెల్లుల్లి ఆయిల్‌ను రెండు మూడు చుక్కలను చెవిలో వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజు వారిగా ఇలా చేస్తుంటే ఇన్ఫెక్షన్‌తో పాటు, నొప్పి కూడా తగ్గుతుంది.

వెల్లుల్లి ఆయిల్‌ను చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మూడు డ్రాప్స్ వేసి కాటన్ పెట్టి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒక టీస్పూన్ ఆవనూనె తీసుకుని, అందులో నువ్వుల నూనె ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. అందులోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొన్ని నిముషాలు మరిగించండి.. నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో ఆ నూనెను అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక క్లాత్‌లో వేసి చెవి చుట్టూ మర్ధన చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

వీటిల్లో ఏదోఒకటి మీకు సింపుల్‌గా ఉండేవి చేయడం వల్ల చెవినొప్పి, చెవిలో ఇన్‌ఫెక్షన్‌ సమస్య తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news