పురుషులకి ఖర్జూరం చేసే మేలు గురించి తెలుసా..?

-

ఖర్జూరం (Dates) వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఖర్జూరంలో ఎమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది.

ఖర్జూరం | Dates

పురుషుల టెస్టోస్టెరీన్ లెవెల్స్ ని ఇది పెంచుతుంది. ఖర్జూరంలో జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 దీని ద్వారా మనం పొందొచ్చు.

ఎలా తీసుకోవాలి..?

రెగ్యులర్ గా ఖర్జూరం తినడం వల్ల టెస్టోస్టెరోన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది పురుషుల ఆరోగ్యం మరింత పెంపొందిస్తుంది. ఫిజికల్ వీక్నెస్ ని కూడా ఇది తగ్గిస్తుంది. పాలల్లో ఖర్జూరం వేసుకుని తీసుకోవడం వల్ల సెమెన్ నాణ్యత పెరుగుతుంది.

దీనిలో ఉండే మెగ్నీషియం షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఇది చూస్తుంది.

ఖర్జూరం వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్:

రెగ్యులర్గా ఖర్జూరం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. దానితో పాటుగా కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలు రాకుండా ఇది చూస్తుంది. పాలు ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. చర్మానికి కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news