అలెర్ట్‌ : ఈ నెల 30 వరకు భారీ వర్షాలు

తెలంగాణకు ఈ నెల 30 వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తెలంగాణ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టమునకు 1.5 కిమి నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలది పశ్చిమ వైపుకి వంపు తిరిగి ఉన్నది. ఈ రోజు ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో రేపు, ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.


వాతావరణ హెచ్చరికలు:- ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలోని ఉత్తర, పశ్చిమ జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఎల్లుండి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం ఉందని… రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో చాలా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.