చ‌లికాలంలో ఆప్రికాట్స్ తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే..!

సీజ‌న్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌నం తినాల్సిన ఆహార ప‌దార్థాల జాబితా కూడా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేస‌విలో పుచ్చ‌కాయ లాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటాం. ఇక చ‌లికాలం వ‌స్తే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటాం. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో అలాంటి ఆహారాల‌ను తింటే మ‌న‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇక చ‌లికాలంలో మ‌న‌కు విట‌మిన్ సిని అందించే అనేక పండ్ల‌లో ఆప్రికాట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎప్పుడైనా ల‌భిస్తాయి. కానీ వీటిని చ‌లికాలంలో తింటేనే ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of eating apricots in winter

* ఆప్రికాట్ల‌లో ఉండే ఔష‌ధ గుణాలు అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. వీటిలో ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చూస్తుంది. దీంతో ఆహారం త‌క్కువ తీసుకుంటారు. ఫ‌లితంగా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

* ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారికి ఆప్రికాట్స్ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిలో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. ర‌క్తాన్ని ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. అందువ‌ల్ల రక్తం లేద‌నే స‌మ‌స్య ఉండ‌దు.

* ఆప్రికాట్ల‌లో ఉండే విట‌మిన్ సి, ఇ లు చ‌ర్మానికి సంర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. ముఖ్యంగా చ‌లికాలంలో ఏర్ప‌డే చ‌ర్మం ప‌గుళ్లను నివారిస్తాయి. దీంతో చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.

* కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆప్రికాట్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. దృష్టి పెరుగుతుంది.

* చలికాలంలో స‌హ‌జంగానే ఏర్ప‌డే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాలంటే.. ఆప్రికాట్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అజీర్ణం అనే మాటే ఉండ‌దు.