ఎండు ఖర్జూరాలు, తేనె.. రెండూ మంచి పౌష్టికాహారాలే. అయితే.. ఈ రెండింటినీ కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందామా మరి..
గింజలు తీసిన ఎండు ఖర్జూరాలను తేనెలో కలిపి నానబెట్టాలి. గట్టిగా మూత పెట్టి వారం తర్వాత ఆ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి లేదంటే రెండు సార్లు తినాలి. దీని వల్ల దగ్గు తగ్గుతుంది. జలుబు ఉంటే అది కూడా తగ్గుముఖం పడుతుంది. దగ్గు, జలుబు అంత త్వరగా రాదు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో రకరకాల వైరస్‌లు శరీరాన్ని అటాక్ చేయలేవు.
నిద్ర రానివారు.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.. నిద్రలేమి తగ్గుతుంది. రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. శరీరంపై ఏవైనా గాయాలున్నా… ఎండు ఖర్జూరలోని యాంటి బయోటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ మిశ్రమాన్ని తినిపిస్తే వాళ్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఈ రెండింటిని కలపడం వల్ల… వాటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త హీనతను తగ్గిస్తాయి. ఎముకలు కూడా బలంగా మారుతాయి. షుగర్ లేవల్స్ అదుపులో ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లు కూడా ఈ మిశ్రమాన్ని తింటే తగిన ఫలితాలు ఉంటాయి.