టీ/ కాఫీలు మానేయలేకున్నారా…హెర్బల్ టీతో సాధ్యం చేసేద్దాం.!

-

చాలామంది కాఫీలు టీలకు బాగా అలవాటు పడినవాళ్లు ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. శరీరానికి ఏమాత్రం మేలు చేయని కాఫీ, టీలు అప్పటికప్పుడు రిలీఫ్ ని ఇస్తూ..స్లో పాయిజన్ లా శరీరాన్ని దహించివేస్తాయి. ఈరోజు మనం వివిధ రకాల హెర్బల్ టీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టీల వల్ల మీకు కాఫీ/ టీలు తాగాలన్న కుతూహలత కలిగినప్పుడు ఇప్పుడు చెప్పుకోబోయే టీలు తాగితే..అటు కాఫీ/ టీల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇటు ఈ హెర్బల్ టీలో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

హెర్బల్ టీ తయారు చేసుకోవడానికి కావాలిసిన పదార్థాలు:

క్యారెట్ తురుము ఒక స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక స్పూన్, అల్లం స్పూన్, తేనె మూడు స్పూన్, , నిమ్మరసం మూడు స్పూన్లు, వాము ఒక స్పూన్.

తయారు చేసే విధానం:

ముందుగా పొయ్యుమీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయండి. వాము ఒక టీ స్పూన్, జీలకర్ర, మిరియాల పొడి, అల్లం తురుము, క్యారెట్ తురుము.. క్యారెట్ తురుము ఎందుకు అనుకుంటున్నారేమో… క్యారెట్ వేసి మరిగించటం వల్ల కలర్ వస్తుంది. పదినిమిషాలు బాగా మరిగించాలి. ఆపై ఫిల్టర్ చేయండి. ఇందులో ఉండే మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ.. ఆ వాటర్ లోకి వచ్చేస్తాయి. ఇందులో సరిపడా తేనే, నిమ్మరసం వేసి కలుపుకుని తాగడమే. కావాలనుకుంటే..యాలుకల పొడి కూడా వేసుకోవచ్చు.

కాపీ మానేయాలనుకునే వాళ్లు టీ తాగొచ్చా అనే సందేహం ఉంటుంది. సరే టీ మానేయమంటే.. గ్రీన్ టీ తాగొచ్చా అని మళ్లీ సందేహం వస్తుంది. ఇది కూడా మానేయమంటే.. హెర్బల్ టీ అయినా తాగొచ్చా అంటారు. అంటే.. మనకు ఏదో ఒకటి తాగాల్సిందే. అందుకే మనకు హానీ లేకుండా, క్యాలీరీలు రాకుండా ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ టీ ఒకటి ఈరోజు చూద్దాం.

కావలసిని పదార్థాలు:

మింట్ లీవ్స్ 50 గ్రాములు, తేనె 3స్పూన్లు, యాలకలు మూడు, నిమ్మరసం ఒక స్పూన్

తయారుచేసే విధానం

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి..వాటర్ పోయండి..అవి మరగనివ్వాలి. ఈ లోపు క్లీన్ చేసుకున్న పుదినాను గ్రైండ్ చేయండి. ఈ గ్రైండ్ చేసిన పుదినా పేస్ట్ ను మరిగే నీళ్లలో వేసి.. మూడు యాలుకలను వేయండి. పది నిమిషాలు పాటు మరగనివ్వండి. ఒక కప్పు తీసుకుని ఒక టీ స్పూన్ నిమ్మరసం వేయండి, తేనె రెండు టీ స్పూన్లు వేసేసి.. అందులో ఈ మరిగిన వాటర్ ని ఫిల్టర్ చేసి వేయండి. అప్పుడప్పుడు ఈ టీ తాగుతూ ఉంటే.. ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.

టీ/ కాఫీలు మానేసినప్పుడు మనకు మన మైండ్ సహకరించదు. అప్పటివరకూ వాటికి అలవాటుపడి హఠాత్తుగా మీరు మానేసినా.. లోపల పార్ట్స్ అన్నీ ఓ గోలపెడతాయి. తాగాలి తాగాలి అని.. అప్పుడు మీరు తాగకపోతే. తలనొప్పి వచ్చేస్తుంది. అలాంటప్పడు ఇప్పుడు చెప్పుకునే తులసీ హెర్బల్ టీ ట్రై చేయండి.

కావాలసిన పదార్థాలు

తులసి ఆకులు అరకప్పు, తేనె రెండు టీ స్పూన్లు, మిరియాల పొడి ఒక టీ స్పూన్, నిమరసం, సోంపు రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం

ముందుగా సోంపు రెండు టేబుల్ స్పూన్ వేసి ముక్కాచెక్కా అయ్యేలా చేసుకోండి, అందులో తులసి ఆకులు వేసి రఫ్ గా గ్రైండ్ చేయండి. ఆ తరువాత పొయ్యిమీద గిన్నెపెట్టి వాటర్ వేసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేయండి. ఆ తరువాత మిరియాల పొడిని ఒక టీ స్పూన్ కూడా వేయండి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే.. అవి ఆఫ్ గ్లాస్ అయ్యేవరకు మరిగించండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి నిమ్మరసం ఒక టీ స్పూన్, తేనె ఒక టీ స్పూన్ వేసి తాగడమే. మూములు టీ కాఫీలు తాగేబదులు ఇలాంటి వాటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

టీ కాఫీలు మానేయాలనుకునేవారు ఇలాంటి వాటిని అలవాట చేసుకోవడం వల్ల త్వరగా వాటినుంచి బయటపడటమే కాకుండా.. మంచి ఆరోగ్యప్రయోజనాలను కూడా పొందుతాం.

ఇంకా.. చాలామందికి గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. కొందరికి కొంచెం తిన్నా కడుపునిండిన ఫీలింగ్ ఉంటుంది. అసలు ఈ గ్యాస్ అనేది తేన్పురూపంలో బయటకురాకుండా.. అపానవాయివు రూపంలో పోకుండా ఉన్నప్పుడు.. పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం తిన్నా కడుపునిండినట్లు ఉండానికి కారణం ఏంటంటే..ప్రేగుల్లో మలపదార్థం ఉండటం. తద్వారా.. మీరు తిందాం అన్నా.. లోపలకిరానివ్వదు. ఇలాంటి వారు ప్రేగులను శుభ్రంచేసుకోవాలి. అవకాశం ఉంటే.. ఎనిమా డబ్బా.. సర్జికల్ షాపుల్లో ఇది దొరుకుతుంది. మూడునాలుగు రోజులు ఎనిమా చేసుకుంటే.. ప్రేగులు శుభ్రంగా క్లీన్ అవుతుంది.

నీళ్లు ఎక్కువగా తాగినా.. ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి. కొంతమందికి..భోజనం తర్వాతా గంట నుంచి ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి కారణం..ఆకలివేయకుండా తినడమే.. వివిధరకాల కారణాల వల్ల ఆకలిలేకుండా తింటాం. దీనిద్వారా గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్, పొట్ట ఉబ్బరం వచ్చినప్పుడు మార్కెట్ లో చాలా టానిక్ లు అందుబాటులో ఉన్నప్పటికి.. నాచురల్ గా తగ్గించుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నీళ్లను బాగా మరిగించి కాఫీలాగా మెల్లగా తాగాండి. ఇలా చేయటం వల్ల ఆ వేడికి పేగల్లో కదలికిలు వచ్చి, స్పింటర్ ఫ్రీ అయి.. తేన్పులు వస్తాయి. లేదా పైన చెప్పుకున్న హెర్బల్ టీ తాగినా మంచి రిలీఫ్ ఉంటుంది.
అలాంటప్పుడు బెల్టును, బొందులను కూడా ఫ్రీగా చేసుకోవాలి. ఈ విషయం చాలా మందికే తెలుస్తుంది.
వాము మరిగించిన నీళ్లను కూడా మెల్లగా తాగితే.. మంచి రిలీఫ్ వస్తంది.

అసలు ఈ గ్యాస్ సమస్య రాకుండా చేసే ముందస్తు జాగ్రత్తలు

రోజుకు మూడు సార్లు మాత్రమే తినాలి. ఆకలిఅయినప్పుడు మాత్రమే తినాలి.
తిన్న రెండు గంటలదాకా నీళ్లు తాగొద్దు
తినేటప్పుడు నీళ్లు తాగటం అస్సలు మంచిది కాదు.
సాయంకాలంపూట పండ్లభోజనం మంచిది
తినేప్పుడు బాగా నమిలితినాలి. ఎంత బాగా నములుతామో..అంత బాగా పొట్టలో జీర్ణం జరుగుతుంది

ఇలాంటి చిన్నచిన్న టిప్స్ ఫాలో అయితే.. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు హెర్బల్ టీలు ఎలా తయారు చేసుకోవాలో, గ్యాస్ వచ్చినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నాం.. పాటిస్తారని ఆశిస్తున్నాం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news