బెల్లం తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?

-

health benefits of jaggery

బెల్లం… చాలా అరుదుగా వాడుతుంటాం. ఎప్పుడో ఏవైనా స్వీట్ ఐటెమ్స్ చేసినప్పుడు తప్పితే.. పెద్దగా వాడం. దాని బదులు ఎక్కువగా చక్కెరను వాడుతుంటాం. కానీ.. చక్కెర కన్నా బెల్లం వాడటమే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఈ విషయాన్నిపరిశోధకులు చెబుతున్నారు.

బెల్లం వాడకం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయట. బెల్లం శరీర బరువును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. జట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. నాడి వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కీళ్లనొప్పులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

చూశారుగా… బెల్లం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. బెల్లం బదులు చక్కెర వాడితే ఇన్ని ప్రయోజనాలను కోల్పోతాం. కానీ.. చక్కెర వాడితే ఎటువంటి ఆరోగ్యం ప్రయోజనాలు ఉండకపోగా… అనారోగ్యం బారిన పడాల్సిందే. అందుకే.. చక్కెర వాడకం తగ్గించండి. బెల్లం వాడండి. చాయ్ ని కూడా బెల్లంతో చేసుకోవచ్చు. పంచదారతో చేసిన చాయ్ కన్నా.. బెల్లంతో చేసిన చాయ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా.. చక్కెర వాడే ప్రతి దాన్ని బెల్లంతో రీప్లేస్ చేసి చూడండి. మీకు టేస్ట్ కు టేస్టు.. హెల్త్ కు హెల్త్. ఏమంటారు.

Read more RELATED
Recommended to you

Latest news