రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. శనివారం ప్రజా భవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసు అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు అన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు వేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు.
విద్యార్థుల త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అధికారంలోకి రాగానే 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. జూన్ 02 నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 09 లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 09 వరకు ఖాలీలు భర్తీ చేస్తామన్నారు. UPSC తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేపట్టామని స్పస్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.