మనం ఇంట్లో సాధారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ వంటివి చేసుకుంటాం. అయితే మీరు ఎప్పుడైనా మందారం టీ కోసం విన్నారా…? బహుశా మీరు విని ఉండరు. దీన్ని సులువుగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ హెర్బల్ టీ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రోజు మందారం టీ వల్ల కలిగే బెనిఫిట్స్ చూద్దాం…!
అలానే మందారం తో చేసిన టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఊబకాయం సమస్య తో బాధపడే వాళ్లకి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అధిక బరువుతో ఉన్న 36 మందిని తీసుకుని మందారం టీ 12 వారాల పాటు ఇచ్చి ఆ పరిశోధన చేయగా… వాళ్ళు బాగా బరువు తగ్గినట్లు, వాళ్ళ కొవ్వు కరిగి పోయినట్టు తెలుస్తోంది.
అలానే క్యాన్సర్ వంటి వాటిని కూడా ఇది దరిచేరకుండా కాపాడుతుంది. నిమోనియా వంటి సమస్యలను కూడా వీటితో తరిమికొట్టొచ్చు. మందారం టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి మరియు యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి.
మందారం టీ ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..!
దీని కోసం ముందుగా మీరు మందార పువ్వులను తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆ పూలను వేసి నీళ్ళు పోసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత వడ కట్టేసి ఆ నీటిని తాగండి. కావాలంటే మీరు కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు. దానివల్ల తియ్యదనం వస్తుంది. దీనిని వేడిగా అయినా చల్లగా అయినా తీసుకోవచ్చు.