దంతాల నొప్పి, నోటి దుర్వాసనని పోగొట్టే మేలైన ఇంటి చిట్కాలు..

-

దంతాల నొప్పి చాలా సాధారణ సమస్య. అలా అని దాన్ని వదిలేస్తూ పోతే అసాధారణంగా మారి ఒక్కోసారి పన్ను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శుభ్రపరచడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకి రెండుసార్లు ఖచ్చితంగా దంతాలని శుభ్ర్రపర్చుకోవాలి. నోటి దుర్వాసనని దూరం చేసుకోవాలన్నా, పళ్ళు, చిగుళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందాలన్నా కింద చెప్పే విషయాలను ఆచరిస్తే సరిపోతుంది.

నల్ల మిరియాలు, పసుపు

నల్ల మిరియాల పొడి, పసుపుని తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసి దంతాలకి మర్దన చేయాలి. నొప్పిగా ఉన్న ప్రదేశాల్లో మెల్లగా మర్దన చేయాలి. ఇలా చేసాక 30నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ టైమ్ లో ఏదీ తినకూడదు, తాగకూడదు. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ పోతుంటే చిగుళ్ళ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

స్ట్రాబెర్రీ:

దంతాలు శుభ్రపరచడానికి పనికొచ్చే మరొక అద్భుతమైన పండు స్ట్రాబెర్రీ. మార్కెట్లో విరివిగా లభించే స్ట్రాబెర్రీ దంతాలకి మంచి బలాన్ని అందిస్తుంది. నోటి దుర్వాసన దూరం కావాలంటే దంతాలు శుభ్రం కావాల్సి ఉంటుంది. అందుకోసం పండిన స్ట్రాబెర్రీని తీసుకుని గుజ్జుగా తయారు చేసుకోవాలి. అ గుజ్జుతో దంతాల మీద మర్దన చేయాలి. రోజూ రెండుసార్లు, ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. అలాగే నోరు శుభ్రం అవుతుంది. దానివల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది.

దంతాలు బలంగా మారడానికి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన దూరం చేసుకోవడానికి ఇలాంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news