డయబెటీస్‌ ఏ దేశంలో ఎంత ఉంది..? ఇండియా పరిస్థితి ఏంటి మరీ ఇలా ఉంది..

-

డయబెటీస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుందని మనందరికీ తెలిసిందే..! ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి కచ్చితంగా ఉంటుంది. ఏ దేశంలో ఎంత శాతం ఉంది అనే లెక్కలు మనల్ని ఒకింత ఆశ్చర్యపరుస్తాయి. ఈ లెక్కల్ని బట్టీ మనం ఎలాంటి ఆహారం తినాలో ఆలోచించుకోవచ్చు. 20 నుంచి 79 ఏళ్ల వయసు వారిని ఇందులో లెక్కలోకి తీసుకున్నారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లను లెక్కలోకి తీసుకున్నారు.

diabetes

ప్రపంచంలో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా ఉన్నది పాకిస్థాన్‌లో. అక్కడ మొత్తం జనాభాలో 30.8 శాతం మందికి షుగర్ వ్యాధి ఉంది.

పాకిస్థాన్ తర్వాత ఎక్కువగా కువైట్‌లో 24.9 శాతం మందికి చక్కెర వ్యాధి ఉంది.

ఇక ఈజిప్టులో 20.9 శాతం, ఖతార్‌లో 19.5 శాతం, మలేసియాలో 19 శాతం మందికి డయాబెటిస్ ఉంది.

సౌదీ అరేబియాలో 18.7 శాతం, మెక్సికోలో 16.9 శాతం, టర్కీలో 14.5 శాతం, బంగ్లాదేశ్‌లో 14.2 శాతం, శ్రీలంకలో 11.3 శాతం మందికి డయాబెటిస్ ఉంది.

దక్షిణ ఆఫ్రికాలో 10.8 శాతం, ఇరాక్‌లో 10.7 శాతం, అమెరికాలో 10.7 శాతం, ఇండొనేసియాలో 10.6 శాతం, చైనాలో 10.6 శాతం మందికి షుగర్ వ్యాధి ఉంది.

స్పెయిన్‌లో ఇది 10.3 శాతంగా ఉంటే, థాయిలాండ్‌లో ఇది 9.7 శాతంగా ఉంది.

ఇండియాలో ప్రతీ 100 మందిలో 9.6 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అంటే చాలా ఎక్కువగా ఉన్నట్లే. భారతీయులుగా మనం మన లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్ల విషయంలో తగిన మార్పులు, జాగ్రత్తలు తీసుకోవాలని ఈ లెక్కలు చెబుతున్నాయి.

డయాబెటిస్ నైజీరియాలో అతి తక్కువగా ఉంది. 3.6 శాతమే ఉంది. అలాగే… కెన్యాలో 4 శాతం, ఇథియోపియాలో 5 శాతం, ఫ్రాన్స్‌లో 5.3 శాతం, అర్జెంటినాలో 5.4 శాతం ఉంది. ఈ దేశాల్లో డయాబెటిస్ తక్కువగా ఉంది.

ఇంకా బ్రెజిల్‌లో 8.8 శాతం, నేపాల్‌లో 8.7 శాతం, కెనడాలో 7.7 శాతం, జపాన్‌లో 6.6 శాతం, ఆస్ట్రేలియాలో 6.4 శాతం, ఇటలీలో 6.4 శాతం, వియత్నాంలో 6.1 శాతం, రష్యాలో 5.6 శాతం మందికి డయాబెటిస్ ఉంది.

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న మనకు దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తున్నాయి. అభివృద్ధి చెందని దేశాల్లోనే డయబెటీస్‌ తక్కువగా ఉంది. సంప్రదాయ ఆహారాలు తినేవారికీ, వ్యాయామాలు, శారీరక పనులు ఎక్కువగా చేసేవారికి అంత త్వరగా డయాబెటిస్‌ రావట్లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news