బాడీకి మంచి కొలెస్ట్రాల్ అవసరం చాలా ఉంది. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు అని రెండు రకాలు ఉంటాయని మనందరికీ తెలుసు.. ఇవి ఉండాల్సిన క్వాంటిటీలో ఉంటేనే మంచిది..లేదంటే సమస్యలు క్యూ కట్టేస్తాయి.. రెండు విభిన్న శక్తులు ఎలా అయితే ఒకే దగ్గర ఉండలేవో..ఇవి కూడా అంతే.. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేస్తుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్ ఫ్యాట్‌ను పంపించేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఒక మైనపులాంటి అంటుకునే పదార్థం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల శరీరానికి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.అసలు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది..? కారణాలు ఏంటీ.? మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్లే అన్ని అనర్థాలు జరుగుతాయి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో బరువు పెరగడం, మద్యం సేవించడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్ధాలు తినడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. ఈ వ్యాధి లక్షణాలను గుర్తెరిగి ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు…
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం అనేది సాధారణంగా తెలియదని వైద్యులు చెప్తున్నారు. కొన్ని నిర్దిష్ట లక్షణాల ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల గురించి తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలలో చేతులు, కాళ్ళలో తిమ్మిరి , విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, వికారం, శరీరంలో తిమ్మిరి వంటివి మెయిన్‌గా ఉంటాయి..
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మంచి వైద్యులను సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష ద్వారానే మీ శరీరం సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. 11 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 నుండి 65 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలట.. కొలెస్ట్రాల్ స్థాయిను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో రోగాలకు ముందుగానే అడ్డుకట్ట వేయొచ్చు.!