షెడ్యూల్‌ సెక్స్‌ అంటే ఏంటో తెలుసా..? భాగస్వామితో బంధాన్ని ఇలా పెంచుకోండి

-

ఈరోజుల్లో భార్యభర్తలు ఇద్దరూ జాబ్‌ చేస్తున్నారు. రెండు వేర్వేరు కంపెనీలు.. రంగాలు వేరు.. కలిసి బతుకుతున్నాం అన్న పేరే కానీ. సరదాగా బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఎవరో ఒకరు జాబ్‌ మానేస్తేనే కలిసి ఉండగలం అన్నట్లు అయిపోయింది. కానీ ఎవరూ మానేయలేరు.. పరిస్థితులు అలాంటివి.. ఇలాంటి కొన్ని కారణాల వల్ల భార్యభర్తలు సెక్స్‌ లైఫ్‌కు దూరంగా ఉంటారు. గ్యాప్‌ వస్తుంది.. అది వారం, నెల, అంత కంటే ఎక్కువే కావొచ్చు.. సెక్స్‌ అనేది కేవలం ఆనందాన్నే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.. ఈ విషయం కొంతమందికే తెలుసు..! ఒకవేళ మీరు మీ పార్ట్‌నర్‌తో లైంగిక సంబంధానికి దూరంగా ఉంటే.. షెడ్యూల్‌ సెక్స్‌ను ప్లాన్‌ చేసుకోండి…. ఇదేంట్రా కొత్తగా ఉంది అనుకుంటున్నారా..? మ్యాటర్‌ ఏంటంటే..

షెడ్యూల్‌ సెక్స్‌ అంటే.. అప్పటి వరకూ.. దానికి సంబంధించిన విషయాల గురించి మీ భాగస్వామితో మాట్లాడొచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. కలిసిన రోజున ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు. షెడ్యూల్ సెక్స్ ద్వారా ప్రయోజనాలూ ఉన్నాయి. ఇద్దరూ కలిశాక రెచ్చిపోతారు. మాటలు అన్నీ గుర్తుచేసుకుంటారు. మీరు సెక్స్ తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. ఈ విషయాన్ని క్యాలెండర్‌లో నోట్ చేసుకోవాలి. దీనితో మనసు ఆ రోజు మీద ఉంటుంది. షెడ్యూల్ చేసిన రోజున మీరు మీ భాగస్వామితో కలిసి స్వేచ్ఛగా ఉండేలా సమయాన్ని ప్లాన్ చేయాలి. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. మీ షెడ్యూల్ సెక్స్ రోజున సాంకేతిక పరికరాలకు దూరంగా ఉండండి. మీరిద్దరూ ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోవాలి.

సెక్స్ షెడ్యూల్ రోజున సెక్స్ నుండి మీరు తప్పించుకోలేరు. అప్పటికే ఆ రోజున చేస్తామనే మాటలు మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతాయి. సెక్స్ టైమ్ టేబుల్ ఫిక్స్ కారణంగా, మీరు మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆనందిస్తారు. సెక్స్ కోసం ప్లాన్ చేసినప్పుడు.. ఆ క్షణాల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీకు చాలా సమయం ఉంటుంది. మీ లైంగిక జీవితాన్ని మంచిగా మార్చేందుకు మీ భాగస్వామితో ప్లాన్ చేసుకోవచ్చు.. సెక్స్ షెడ్యూల్ చేయడం మీ సంబంధానికి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది. నాణ్యమైన సమయానికి హామీ ఇస్తుంది. అయితే వారానికోసారో.. లేదంటే రెండు మూడు రోజులకు ఒక్కసారో.. మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ షెడ్యూల్ చేస్తే, ఎక్కువ సెక్స్‌ చేసే అవకాశం ఉంటుంది.

కనీసం ఒక వారం ముందుగానే క్యాలెండర్‌లో సెక్స్‌ని షెడ్యూల్ చేయండి. బిజీ షెడ్యూల్‌లతో లైఫ్ ఎటో వెళ్తుంది. మీ లైంగిక జీవితం దెబ్బతింటుంది. మీ క్యాలెండర్‌లో సెక్స్‌ని షెడ్యూల్ చేయడం అనేది మీ సెక్స్ జీవితం దెబ్బతినకుండా చూసుకోవడానికి ఒక మంచి మార్గం.

Read more RELATED
Recommended to you

Exit mobile version