జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు సమస్యలు మాయం.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

-

కాలుష్యం పెరగడం వల్ల, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.. అలాంటివారికి జామ ఆకులు దివ్య ఔషదాంలా పనిచేస్తాయి.. జామాకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామాకులు కరెక్ట్. అవి ఎంతగానో ఉపయోగపడతాయి. జామ ఆకులతో ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి…

ఇక జామ ఆకులతో చేసిన టీ వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది. జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే జుట్టు నల్లగా మారుతుంది. కాంతివంతంగా ఉండి మెరుస్తుంది.. ఇంకా చుండ్రు కూడా రాకుండా ఉంటుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి..మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news