నీ గుండె కరగడం లేదా కేసీఆర్ దొరా? అంటూ వైఎస్ షర్మిల వివాదస్పద పోస్ట్ పెట్టింది. తడిసిన వడ్లు కొనాలని, కోతలు పెట్టవద్దని రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా.. నీ గుండె కరగడం లేదా కేసీఆర్ దొరా? ఇదేనా కిసాన్ సర్కారు అంటే? అని నిలదీశారు. ఎండనకా, వాననకా రైతులు కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తుంటే.. గడీల్లో దర్జాగా బ్రతకడమా? పెద్ద రైతును అని చెప్పుకునే స్వయం ప్రకటిత మేధావికి.. రైతుల బాధలు నెత్తికెక్కడం లేదా ? అని ప్రశ్నించారు.
అప్పుల పాలైన రైతన్న రోదిస్తుంటే.. వచ్చిన అరకొర దిగుబడిపైనా కోతలా? మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలుకు 12 కిలోల తరుగు తీసి, రైతుల పొట్టుకొడుతున్నా మౌనం వీడవా? అని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. ఇంతైనా చలించని నీ నికృష్టపాలనకు నిరసనగా, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఇవాళ YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా IKP కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తుందని ప్రకటించారు షర్మిల.