ఎండుద్రాక్ష, పుల్లటి పెరుగు కలిపి తింటే.. నిజంగానే మోకాళ్ల నొప్పులు ఉండవా..?

-

ఏ కాలంలో అయినా.. డైలీ పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తుంటారు.. ముఖ్యంగా సమ్మర్లో రోజులో ఒక్కసారి అయినా పెరుగును కచ్చితంగా తీసుకోవాలి..ఇందులో ఉండే ప్రోబయోటిక్స్, హెల్తీ బాక్టీరియా ఆరోగ్యాన్ని కాపడతాయి. అయితే పుల్లటి పెరుగుకు ఎండు ద్రాక్ష కాంబనేషన్ తో తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయట.. మరి అవేంటో చూద్దామా..!

వయసు పెరిగే కొద్ది ఎముకల సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో ముసలివారు బాగా ఇబ్బందిపడతారు కదా.. పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్షను కలిపి తీసుకోవడం వలన ఈ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలపర్చడంలో సహాయపడుతుంది.

ఓ ఏజ్ వచ్చేసరికి మహిళలకు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం వలన మహిళల ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. శారీరక నొప్పులు కూడా దూరమవుతాయి.

ఇది అసలు బెనిఫిట్.. పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

సాధారణంగా అందరూ పెరుగులో పంచదార వేసుకుని..కాదు కాదు పోసుకుని తింటారు. దీనివల్ల టేస్టీగా ఉండి కడుపు కూడా చల్లగా ఉంటుందేమో కానీ.. పంచదార వాడకం ఆరోగ్యానికి అంత మంచిది కాదు..కాబట్టి హెల్తీగా టేస్టీగా ఇది ట్రై చేయండి ఈసారి..! అయితే డైరెక్టుగా పెరుగులో కంటే.. నైట్ పాలు తోడుపెట్టేటప్పుడే.. పాలల్లో పెరుగుతో పాటు.. ఎండుద్రాక్షాలకు కూడా వేసి తోడేస్తే.. అది పెరుగు అవుతుంది కదా అలా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. వేసవి తాపం నుంచి బయటపడాలంటే.. డైలీ ఇలా ఓ కప్పు పెరుగును తీసుకుంటే సరి..! పొట్ట చల్లగా ఉంటుంది.

ఇంకా ఇది పురుషులు తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత కూడా పెరుగతుందని సైంటిఫిక్ స్డడీస్ చెప్తున్నాయి. వారికి ఆ రకంగా మేలు జరుగుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news