కాంగ్రెస్ పార్టీది అదే పాత పాట : నిరంజన్ రెడ్డి

-

వ‌రంగ‌ల్ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భలో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుద‌ల చేసిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌పై టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మితే 2014, 2018లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు ఎందుకు ఓడించారని, ఇచ్చుడు, తీసుకునుడు లేదిక్కడ అని చెప్పిన నిరంజన్ రెడ్డి.. ఎనలేని త్యాగాలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారన్నారు.

Hyderabad: Minister Niranjan Reddy dubs BJP 'Business Corporate Party'

2004లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా రాష్ట్రపతి నోటి నుండి తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రకటించి పదేండ్లు తాత్సారం చేసిన ఫ‌లితంగానే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకున్నదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన‌ ఇందిరమ్మ ఇళ్ల భాగోతం సీబీసీఐడీ విచారణలో తేలిపోయింద‌ని, కట్టని ఇండ్లకు బిల్లులు ఎత్తిన మాయాజాలం కాంగ్రెస్‌ద‌ని మంత్రి నిరంజన్ రెడ్డి విమ‌ర్శించారు. 2018 ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని తిరస్కరించార‌న్నారు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే పాత పాట పాడుతున్నదని ఆయ‌న ఎద్దేవా చేశారు

Read more RELATED
Recommended to you

Latest news