వేసవి అంటేనే వేడిగాలులు, హై టెంపరేచర్. ఇటువంటి సమయంలో హీట్ స్ట్రోక్ మొదలైన సమస్యలు కలుగుతాయి. అందుకనే సమ్మర్ లో వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. పైగా డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎండాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకని అటువంటి వాటికి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మంచి నీళ్లు ఎక్కువగా తాగడం మొదలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ వేసవి లో వేడి గాలిని తట్టుకోవాలంటే ఏసి ఒక్కటే పరిష్కారం కాదు. ఈ టిప్స్ ని కూడా మీరు ఫాలో అయితే మంచిది. వేసవి కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీటిని అనుసరిస్తే మంచిది. దీని వల్ల ఎండ వల్ల ఇబ్బంది ఉండదు.
వేసవి కాలంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇది మెటబాలిజంను పెంచుతుంది.
అలానే ఆల్కహాల్ మరియు కెఫిన్ కి దూరంగా ఉండాలి.
రోజంతా హైడ్రేట్ గా ఉండేట్లు చూసుకోవాలి.
చెమట వల్ల ఎక్కువ నీరు బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి.
అలానే తేలికపాటి దుస్తులు వేసుకోవడం మంచిది. కాటన్ బట్టలనే ప్రిఫర్ చేయండి.
అదే విధంగా లైట్లన్నీ ఆపేస్తే రూమ్ లోపాలకి వేడి కలగకుండా ఉంటుంది. దీనితో హీట్ సమస్య ఉండదు.
ఏసీ ఫిల్టర్లు ని ప్రతివారం కూడా శుభ్రం చేస్తూ ఉండండి. సూర్యకిరణాల లోపలికి రాకుండా కిటికీలకు మూసేయండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేడి కలగకుండా ఉంటుంది. దీంతో చల్లగా ఉండొచ్చు పైగా సమస్యలేమీ కూడా లేకుండా ఉండొచ్చు.
వేసవిలో పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, తాటి ముంజలు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది. అలానే నీళ్లు కూడా ఎక్కువగా అందుతాయి. డీహైడ్రేషన్ సమస్య కూడా కలగదు.