ఇంటర్ చదువుతున్నారా..? నెక్స్ట్ ఏంటో తెలియడం లేదా..? అయితే ఇలా మీ కెరీర్ ని ఎంచుకోండి..!

-

మంచి సక్సెస్ ని అందుకోవాలన్నా… మంచిగా టాప్ లో ఉండాలన్నా మీరు తీసుకునే స్టెప్ చాలా ముఖ్యం. అందుకనే విద్యార్థులు పదే పదే తమ కోర్సుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా టెన్త్ పూర్తి చేశారా…? ఏం చదివితే బాగుంటుంది అన్న ఆలోచనలో పడ్డారా..?

అయితే మీరు తప్పక దీని కోసం చూడాల్సిందే. ఇంటర్ చదువుతున్నారా..? అయ్యాక ఏమి చెయ్యాలి నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారా..? అయితే వీటిని చూడండి. ఇక్కడ ఉన్నట్టు మీరు ఫాలో అయితే మంచిగా నిర్ణయం తీసుకోవడానికి అవుతుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.

ముందుగా ఆలోచించుకోండి:

మీరు ఇంటర్ చదువుతున్నప్పుడే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. అలాగే అందులో మీరు సక్సెస్ అవ్వగలరా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇంకేం చేయొచ్చు అనేది కూడా చూసుకోండి.

మీ లక్ష్యాన్ని బట్టి అనుసరించడం ముఖ్యం:

మీ కెరీర్ ఎంచుకునేటప్పుడు మీ యొక్క స్ట్రెంత్ వీక్నెస్ వంటివి దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం నడుచుకుంటే మంచిది. అలానే మీ ఆశయం ఏమిటో దానికి తగ్గట్టుగా కోర్సును ఎంచుకోవాలి.

ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి:

మీకు దేని మీద ఆసక్తి ఉంటే దానికి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే అందులో మీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు కనుక ఫలానా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వగలను అని నమ్మకం ఉంటే దానిని ఎంచుకోండి.

కోర్సు గురించి రీసెర్చ్ చేయండి:

కెరీర్ అవకాశాలు మొదలైన ఇన్ఫర్మేషన్ గురించి రీసెర్చ్ చేయండి ఇలా అధ్యయనం చేసి ఆ తర్వాత మాత్రమే ఆ కెరీర్ ని ఎంపిక చేసుకోండి.

కచ్చితంగా అవగాహన ఉండాలి:

మీరు ఏ దారిలో అయితే వెళ్లాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి అవగాహన మీకు ఉండాలి. తెలుసుకోకుండా అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల మీ కెరియర్ దెబ్బతింటుంది. అలానే మీ కెరియర్ కనుక మీకు సెట్ కాలేదు అంటే మారిపోయి మంచి నిర్ణయం తీసుకోండి.

ఇతరులు వెళ్తున్నారు కదా అని వెళ్లదు:

ఇతరులతో పోల్చుకోవడం వాళ్లు అలా చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే బాగుంటుందేమో అని మీ బలాన్ని మర్చిపోయి అనవసరమైన దారిలో వెళ్ళకండి.

రియల్ వరల్డ్ ఏంటో తెలుసుకోండి:

మీరు ఏ కెరీర్ ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఊహా ప్రపంచం లో కాకుండా బయట ఎలా ఉంటుంది అనేది చూసి దాన్నిబట్టి స్టెప్ తీసుకోవాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news