ఈ కూరగాయలతో ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

-

అన్నిటి కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా. అయితే కరోనా మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు అయితే చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ఇటువంటి సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలని డైట్ లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా ఇమ్మ్యూనిటి ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఆరోగ్యనిపుణులు ఇమ్యూనిటీని పెంచుకునే కూరగాయల గురించి తెలిపారు. అయితే మరి ఏ కూరగాయలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

బ్రోకలీ:

బ్రోకలీ లో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి. ప్రతిరోజు బ్రోకలిను తీసుకోవడం వల్ల బీటాకెరోటిన్ పెరుగుతుంది. ఇది ఇమ్యూన్ సెల్స్ ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాప్సికం:

క్యాప్సికం లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలలో 190 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. క్యాప్సికంని కూడా మీరు రెగ్యులర్ గా ఉపయోగించండి. దీనితో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

కాలిఫ్లవర్:

కాలీఫ్లవర్ లో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ కే, ఫైబర్ ఉంటాయి. ఇది కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సహాయపడుతుంది. కనుక ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకొని అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news