పని ఒత్తిడి వలన పెరిగిన గుండెపోట్లు..!

-

కొన్ని కొన్ని సార్లు మనం ఒత్తిడి చిన్నది అనుకుంటాం. కానీ ఒత్తిడి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం పని ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, నీరసం కారణంగా హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ ఎక్కువగా పురుషుల్లో మరియు మహిళల్లో పెరిగింది అని అధ్యయనం ద్వారా రీసెర్చర్లు చెబుతున్నారు.

Increased heart rate due to work stress

బుధవారం నాడు ఈ విషయాలని యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తెలిపింది. అదే విధంగా డయాబెటిస్, ఆర్టెరీల్ హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్, ఒబిసిటీ మరియు ఫిజికల్ ఇన్ యాక్టివిటీ వలన కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. అలానే పని ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు కూడా కార్డియోవాస్క్యులర్ సమస్యలని పెంచుతాయి.

అయితే మామూలుగా పురుషులకి మహిళల కంటే ఎక్కువ హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్స్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ స్టడీ మహిళల్లో కూడా రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. మహిళల్లో ఒత్తిడి, నిద్రలేమి, సమస్యలు, అలసట, నీరసం కారణంగా హార్ట్ ఎటాక్స్  సమస్య వస్తున్నట్లు గుర్తించారు, ఈ కాలంలో చాలా మంది మహిళలు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇంటి పనులు ఇలా ఎన్నో పనులు ఉంటాయి. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అయితే మనం గతంతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా అనారోగ్య సమస్యలు మహిళల్లో మరియు పురుషుల్లో వస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news