నా తమ్ముడు నిప్పు కణం : చిరు ఎమోషనల్ ట్వీట్

ఇవాళ జనసేన అధినేత మరియు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన ఉత్సాహం నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఇతరులు… ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి. చిన్నప్పటి నుంచి సమాజం గురించే తన తమ్ముడు ఆలోచిస్తారని.. తన తమ్ముడు ఒక నిప్పు కణం అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నాడు.

“చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ” మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.