ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్​తో సంతానోత్పత్తిపై ప్రభావం.. UEA అధ్యయనంలో వెల్లడి

-

స్లిమ్​గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్, ఎక్సర్సైజ్, జిమ్, యోగా ఇలాంటివన్నీ చేస్తూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది ఫాలో అయ్యే డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఈ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం సంగతి అటుంచితే.. దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ అంగ్లియా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలతో బృందం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను రాయల్‌ సొసైటీ బీ జర్నల్‌లో ప్రచురించారు. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ వల్ల శరీర బరువు, ఆరోగ్యంపై మాత్రమే కాకుండా వీర్య కణాలు, అండాల ఉత్పత్తిపై కూడా ప్రభావం ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.

‘‘’ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌లో తీసుకునే ఆహార పద్ధతుల కారణంగా వీర్య కణాలు, అండాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఉపవాస పద్ధతిని పాటించడం ఆపిన తర్వాత కూడా ఇది సంతానోత్పత్తి సామర్ధ్యంపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించాం’’’ అని యూఏఈ బయోలాజికల్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలెక్సీ మాక్లాకోవ్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news