కాప్సికమ్ తింటే ఊపిరితిత్తులకి మంచిదేనా..లంగ్స్ ఆరోగ్యానికి ఏం తినాలి?

మనిషి శరీరంలో ప్రతి పార్ట్ చాలా ప్రత్యేకం. అన్నింటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. బైక్ లో పార్ట్స్ ఫెయిల్ అయినప్పుడు ఈజీగా రీప్లేస్ చేస్తాం..కానీ మన బాడీలో ఏదైనా పార్ట్స్ ని రీప్లైస్ చేయాలంటే..లక్షల్లో డబ్బు పెట్టాలి..కొన్నిసార్లు అలా పెట్టినా ప్రయోజనం ఉండదు. కానీ మనం తెలిసీ తెలియక..శరీరంలో అవయువాలకు హాని కలిగించేవి తింటాం, తాగుతాం. అసలు పొగతాగటం వల్ల లంగ్స్ పాడవుతాయి అని అందరికి తెలుసు..కానీ ఎవడూ మానడు. తాగి తాగి ఆఖరికి లంగ్ క్యాన్సర్ వచ్చి హాస్పటల్ పాల్ అవ్వల్సాసిందే. వీళ్ల గురించి పక్కన పెడితే..మనం తినే ఆహారం..కడుపు నింపుకోవడానికి తినటం ప్రధానం..కానీ మనం తినే ఫుడ్ లో ఒక్కో అవయువానికి ఒక్కో రకమైన ఆహారం ఆరోగ్యంగా ఉంచుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..పీచుపదార్ధాలు, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజెలు తినాలి.ఇలా ప్రతి అవయువం ఆరోగ్యంగా ఉండాలంటే..వాటికి నచ్చే ఫుడ్స్ మనం ఇవ్వాలన్నట్లు..ఈరోజు లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ రకమైన ఆహారం తినాలో చూద్దాం.

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారం మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్స్, ఫొరాట్, ప్రొటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. మన జీవన విధానం మారాలి. మన ఆహార అలవాట్లు మారాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటి వాటి జోలికి పోకుండా.. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కివీ పండ్లు, యాపిల్స్, నిమ్మకాయ, మామిడి, పాలకూర, క్యాబేజీ, బెర్రీ పండ్లు.. ఎక్కువగా తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. అంటే.. విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఫుడ్‌తో పాటు లైసోపీన్ ఎక్కువగా ఉండే టమాటాలు, కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారెట్స్, పాలకూర, మిరియాలు, ఆంథోకియానిన్స్ ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.

బెర్రీస్..

బెర్రీస్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెర్రీస్ చూడటానికి చిన్న సైజ్‌లో ఉండి ఎర్రగా కనిపించేటటువంటి ఈ పండ్లు ఎక్కువగా అటవీ ప్రాంతాలలోనే పండుతాయి. వీటిలో అధిక శాతం విటమిన్ – సి ఉంటుంది. బెర్రీస్‌లో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బెర్రీస్‌ను తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలో ఏర్పడేటటువంటి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమంగా ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలు సమానంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.

​ఆకు కూరలు:

ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది లంగ్స్ హల్త్ కే కాదు..మొత్తం మీ శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఆకు కూరలతో తయారు చేసిన వంటలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఆకుకూరలను ఎక్కువగా ఉడికించకుండా..ఎక్కవుగా మసాలాలు, ఉప్పు, కారాలు వేయకుండా తింటేనే..అందులోంచి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

​వాల్ నట్స్

వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్, లంగ్స్ సంబంధిత వ్యాధులను తగ్గించటంలో ఉపయోగపడతాయి.. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి.

​బ్రొకోలీ

బ్రొకోలీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇతర ఆహార పదార్థాల కంటే ఇది చాలా శక్తివంతమైన ఆహారంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఇందులో అధిక ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, లూటిన్, బీటా కెరోటిన్, జియాక్సిథిన్ ఇవన్నీ కూడా పవర్ ఫుల్ యాకంటీఆక్సిడెంట్స్ వీటి వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి. అలాగే మన లంగ్స్ ని హెల్దీగా ఉంచుతుంది.

బెల్ పెప్పర్

దీన్ని ‘కాప్సికమ్’ అనీ ‘బెంగుళూరు మిర్చి’ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మనకు కాప్సికమ్ పేరే బాగా తెలుసు… వివిధ రంగుల్లో ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇలా రెండు మూడు రంగుల్లో లభించే క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆస్థమా వంటి వ్యాధులను నివారిస్తుంది. శ్వాసవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.

– Triveni Buskarowthu