పాలన చాతకాకపోతే చేతులెత్తేయాలి : కేసీఆర్ పై ఈటల ఫైర్‌

-

ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ రాష్ట్రమ‌ని సీఎం కేసీఆర్ కు ఈట‌ల రాజేంద‌ర్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని అణచి వేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలను కుంటునారని… కానీ ఇది బెంగాల్ కాదు తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలన చాతకాకపోతే చేతులెత్తేయాలని సవాల్ విసిరారు.

భారతీయ జ‌న‌తా పార్టీ చాలా క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న పార్టీ అని.. పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు సీఎం చెప్పినట్టు చేయరని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల నుంచి బీజేపీ ఒక కమిటీ మెంట్ తో పనిచేస్తున్న పార్టీ అని.. పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్య మంత్రి తీరు చూసి టీ ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్లు అసహ్యించు కుంటున్నారని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు, బాయిల్ రైస్ విషయంలో కేంద్రం మీద సీఎం కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. యాసంగి ధాన్యంలో నూకల శాతం తగ్గించేలా రైస్ మిల్ ల టెక్నాలజీ పై దృష్టి పెట్టకుండా కేంద్రంపై నెపం మోపుతున్నారని నిప్పులు చెరిగారు. రైతు బంధుకు 1,500 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం… నూకల తో రైస్ మిల్లర్లకు కలిగే నష్టం భరించేందుకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టలేరా అని నిల‌దీశారు.

Read more RELATED
Recommended to you

Latest news