నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా..? అధ్యయనాలు ఏం అంటున్నాయి..

-

నిద్ర అనేది మనిషికి చాలా అవసరం..ఆహారం లేకుండా అయినా ఉండగలరేమో కానీ.. వరుసగా మూడు రోజులు నిద్రలేకపోతే మనిషి చనిపోతాడు తెలుసా.. అంత ముఖ్యమైనది నిద్ర.. అయితే నిద్ర రాక కొంతమంది ఇబ్బంది పడుతుంటే.. నిద్ర ఎక్కువై ఇంకొంత మంది ఇబ్బంది పడతారు. నిద్రపోయే ముందు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి.. తినకూడనివి ఉంటాయి.. మనం తెలిసీ తెలియక ఏం చేయొద్దో అవే చేయడం వల్ల నిద్రరాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంత మందికి నిద్రకు ఉపక్రమించే ముందు నీళ్లు తాగుతుంటారు. నిద్రలో గొంతు దాహంతో ఎండిపోతుందేమో అని.. అసలు నిద్రపోయే ముందు నీళ్లుతాగొచ్చా.. తాగితే చల్లని నీళ్లు తాగాలా? లేక వెచ్చని నీళ్లు తాగాలా? అనే డైలమా చాలా మందికి ఉంటుంది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే…
నిద్రకు ముందు నీళ్లు తాగడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది. నిద్రలో ఢీ హైడ్రేషన్ అయితే శరీరం చల్లగా లేదా వేడిగా అవుతుందట. అందుకని నిద్రకు ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే బెటర్ అనేది నిపుణుల అభిప్రాయం. శరీరం సౌకర్యంగా ఉంటే నిద్ర చెదిరిపోకుండా ఉంటుంది. 2014లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్ లో శరీరం డీహైడ్రేట్ అయితే మూడ్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడతుంది.
అలా అని ఎక్కువగా తాగొద్దు. దాని వల్ల నిద్ర డిస్టబ్‌ అవుతుంది. ఒక గ్లాసు అయితే తాగొచ్చు. నిద్రకు ముందు ఎక్కువ నీళ్లు లేదా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన కోసం మధ్యలో లేవాల్సి వస్తుంది. చాలా సమయం పాటు మూత్రం ఆపుకోవాల్సి వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిరంతరాయ నిద్ర అవసరం. మధ్యలో మేల్కోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా ప్రతిరోజు జరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్ని సార్లు నిద్రభంగం.. గుండె సంబంధ అనారోగ్యాలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
అందుకే నీళ్ల తాగిన తర్వాత వెనువెంటనే నిద్రకు ఉపక్రమించిడం అంత మంచిదికాదు. ఇలా నీళ్లు తాగి అలా నిద్రపోతే మంచి నిద్రలో మూత్ర విసర్జన కోసం మేల్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిద్రలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా, నిద్రకు అంతరాయం కలుగకుండా ఉండాలంటే నిద్రకు ఉపక్రమించేందుకు కొద్దిగా నీళ్లు తాగి మూత్ర విసర్జన తర్వాత నిద్రపోవడం ఉత్తమం.. అప్పుడే ఫుల్‌గా వాటర్‌ తాగి..బెడ్‌ ఎక్కితే.. ఇక అంతే..!!

Read more RELATED
Recommended to you

Latest news