ప్రకృతికి మనిషికి దగ్గర సంబంధం ఉంటుంది. సీజన్లో వచ్చే మార్పులు వల్ల మనలో కూడా ఛెంజెస్ వస్తుంటాయి. అందుకే ఏ సీజన్ కు ఏం తినాలో అవితింటే ఆ సీజన్ లో వచ్చే రోగాల బారినపడకుండా ఉండొచ్చు. శీతాకాలంలో వేడి ఉండడు..ఆ చల్లటి గాలికి చాలామందికి సమస్యలు వస్తుంటాయి. సైనస్ తో బాధపడేవారైతే..ఉదయం బయటకురావాలంటే భయపడిపోతారు. శీతాకాలంలో తినే ఆహారం విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే వయసు పై బడుతున్న కొద్ది మహిళలు శరీరానికి అధికపోషకాలు అందించాల్సి ఉంటుంది. శీతాకాలంలో వచ్చే ఛేంజెస్ వల్ల మహిళల శరీరంలో చర్మం, జుట్టు, ఎముకులకు సంబంధించి సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్ల వయసున్న మహిళల వెన్ను, కాళ్లలో నొప్పి సమస్యలు ఎక్కువుగా ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించటానికి ముఖ్యంగా ఏం తినాలో ఇప్పుడు చూద్దాం.
1. విటమిన్ సి: శీతాకాలంలో విటమిన్ సి చాలాముఖ్యం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకని నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన సిట్రస్ పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.
2. గంజి: గంజి మంచి అల్పాహారం. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం వరకూ ఆకలి వేయకుండా చేస్తుంది. గంజిలో అదనపు రుచి కోసం.. డ్రై ఫ్రూట్స్ జోడిస్తే.. మంచి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన పెద్దోళ్లు గంజితాగే చాలా బలంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడంతా కుక్కర్స్ వచ్చేశాయ్ కదా..గంజి ఎవరూ చేసుకోవటం లేదు. కానీ గంజితాగటం మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు.
3. రాగులు: రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు రాగులతో చేసిన ఆహారం తప్పనిసరిగా తినాలట. మధుమేహం, రక్తహీనత రోగులు రాగుల తినే ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి పరిస్థితులపై పోరాడడానికి రాగులు ఉపయోగపడతాయి.
4. చిలగడదుంపలు : స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు మరియు అధిక పోషకాలు, అవి మీ పొట్టకు ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపలు మలబద్ధకాన్ని నయం చేయడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.వీటిని ఉడకపెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.
5. ఆకుకూరలు : ఆకుపచ్చని కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకనే శీతాకాలంలో రెగ్యులర్ గా తినే ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరలను తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆకులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శీతాకాలంలో సాధారణంగా ఎదుర్కొనే చర్మం , జుట్టు సమస్యలనుంచి ఆకుకూరలు మనల్ని కాపాడతాయి.
6. బాదం, అక్రోట్లు: డ్రైపూర్ట్స్, బాదం, వాల్‌నట్ వంటివి రెగ్యులర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు చురుకైన నాడీ వ్యవస్థను, ఆరోగ్యకరమైన గుండెను ఇస్తుంది. అందుల్లనే శీతాకాలంలో రోజు సాయంత్రం తినమని వైద్యులు సూచిస్తున్నారు. బాదం, వాల్ నట్ అయితే మన బడ్జెట్ లో వచ్చేస్తుంది. కాబట్టి అమ్మలు ఆరోగ్యం మీద అశ్రద్ద చేయకుండా ఈ శీతాకాలం మీమల్మి మీరు కాపాడుకోండి.