ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం ఎంత హానికరమో తెలుసా..? ఐఐటీ తాజా అధ్యయనం..

-

పొద్దున్న లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కానీ మీకీ విషయం తెలుసా..? ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఎంత పెద్ద పెద్ద్ద ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఐఐటీ ఖరగ్ పూర్ తాజా అధ్యయనం పేర్కొంది. రోజూ మూడు కప్పుల టీ తాగడం వల్ల 75వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్తున్నాయని తెలిపింది.

ఐఐటీ ఖరగ్ పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ చెప్పిన దాని ప్రకారం, కూల్ డ్రింక్స్, సహా టీ, కాఫీ తాగడానికి డిస్పోజబుల్ గ్లాసుల వాడకం బాగా పెరిగిందని చెప్పింది. పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ తాగడం వల్ల అందులోని ప్లాస్టిక్ కణాలు కరుగుతాయని, డిస్పోజబుల్ గ్లాసుపై ఉండే సన్ననైన పొర వేడికి కరిగి, టీ తో పాటు లోపలికి వెళ్తుందని, అది ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలియజేసింది.

ఐఐటీ అధ్యయనం ప్రకారం, 25వేల మైక్రాన్-పరిమాణ మైక్రోప్లాస్టిక్ కణాలు 100 mL వేడి ద్రవంలోకి 15 నిమిషాల పాటు కాగితపు కప్పులలో నివసిస్తాయి. దానివల్ల సగటున రోజులో 3సార్లు టీ తాగే వ్యక్తి 75వేలకి పైగా మైక్రో ప్లాస్టిక్ కణాలని తీసుకుంటాడని తెలిపారు.

పేపర్ గ్లాసులో వేడి వేడి టీ తాగడం వల్ల అందులో పల్చటి పొర కరిగి దాని ద్వారా పెల్లాడియం, క్రోమియం, కాడ్మియం అనే విష పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి. వాటి వల్ల జరిగే హాని చాలా హెవీగా ఉంటుందని ఐఐటీ సూచించింది. పర్యావరణ కాలుష్యం జరుగుతుందన్న కారణంగా పేపర్ కప్పుల్లో టీ తాగమని చెప్తున్నారు గానీ, దానివల్ల మానవాళికి మరింత ప్రమాదం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news