అల్ల‌నేరేడు పండ్లే కాదు.. చెట్టు మొత్తం ఉప‌యోగ‌క‌ర‌మే..!

-

వేస‌వి కాలం ముగింపున‌కు వ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో మ‌నకు ఎక్క‌డ చూసినా అల్లనేరేడు పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఈ నెల‌లో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. అయితే ప్ర‌తి సీజ‌న్‌లోనూ మ‌నం ఆయా పండ్ల‌ను తిన్న‌ట్లే ఈ సీజ‌న్‌లోనూ అల్ల నేరేడు పండ్లను తినాలి. వీటితో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణంగా ఈ పండ్లు తీపి, వ‌గ‌రు, పులుపు కాంబినేష‌న్ రుచిలో ఉంటాయి. ఇవి మ‌న‌కు వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. ఆక‌లిని పెంచుతాయి. మ‌న శ‌రీరంలో క‌లిగే పైత్యాన్ని త‌గ్గిస్తాయి. విరేచ‌నాల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అల్ల‌నేరేడు పండ్ల‌ను తినాలి. శ‌రీరంలో ఉన్న వేడి కూడా పోతుంది.

కేవ‌లం నేరేడు పండ్లు మాత్ర‌మే కాదు, దాని ఆకులు, బెర‌డు, ఇత‌ర భాగాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ‌తాయి. అనేక ఆయుర్వేద ఔష‌ధాల్లో వాటిని వాడుతారు. హిందీలో నేరేడును జామూన్ అని, ఇంగ్లిష్ లో జంబుల్ ది బ్లాక్ ప్ల‌మ్ అని పిలుస్తుంటారు. అల్ల‌నేరేడు పండ్లు మ‌ధుమేహాన్నిత‌గ్గిస్తాయి. ఆ పండ్ల విత్త‌నాల‌ను ఎండబెట్టి పొడి చేసి రోజూ తీసుకుంటే షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది.

* నేరేడు పండ్ల గింజ‌ల పొడిని క‌షాయంగా కాచి అందులో పాలు, తాటి క‌ల‌కండ క‌లిపి నిత్యం రెండు పూటలా తాగితే అతి మూత్రం, మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తాయి.

* అల్ల‌నేరేడు చెట్టు ఆకుల‌ను ఇంటి ద్వారానికి తోర‌ణాలుగా క‌డితే ఇంట్లోకి హానికార‌క క్రిములు, బాక్టీరియా, వైర‌స్‌లు రాకుండా ఉంటాయి.

* అల్లనేరేడు పండ్లు లివ‌ర్‌కు మేలు చేస్తాయి. లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగిస్తాయి. క‌డుపులోకి ప్ర‌మాద‌వ‌శాత్తూ చేరే త‌ల వెంట్రుక‌లు, లోహ‌పు ముక్క‌ల‌ను కూడా అల్ల‌నేరేడు పండ్లు క‌రిగిస్తాయి.

* అల్ల‌నేరేడు చెట్టు బెర‌డు లేదా పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటే దంత స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు. నోటి దుర్వాసన కూడా త‌గ్గుతుంది. అల్ల నేరేడు గింజ‌ల చూర్ణంలో కొద్దిగా ఉప్పు క‌లిపి దాంతో దంతాల‌ను తోముకోవ‌చ్చు.

* శ‌రీరంపై కాలిన గాయాలు, దెబ్బ‌లు, పుండ్ల‌పై అల్ల‌నేరేడు ఆకుల మిశ్ర‌మాన్ని రాసి క‌ట్టు క‌డితే త్వ‌ర‌గా గాయాలు త‌గ్గుతాయి.

* అల్లనేరేడు పండ్ల గుజ్జు, ప‌టిక‌బెల్లం క‌లిపి స‌న్న‌ని మంట‌పై వేడి చేసి పాకంలా త‌యారు చేసుకుని, రోజూ 2 టీస్పూన్ల మోతాదులో ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని, అర గ్లాసు మంచినీటిలో క‌లిపి సేవిస్తుంటే ఎంత‌టి తీవ్ర‌మైన ద‌గ్గు స‌మ‌స్య అయినా త‌గ్గుతుంది. శ్వాసకోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news