మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా…? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలం లో మోకాలు నొప్పులు అనేవి అందరిలో సర్వ సాధారణంగా మారి పోయాయి ప్రతీ ఒక్కరు ఈ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహార లోపం కారణంగా కాస్త వయసు పెరిగగానే మోకాళ్ళ నొప్పుల తో సతమతం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా చాల మంది ఎక్కువగా నడవడం వల్ల మరింత ఎక్కువగా మోకాళ్లు అరిగిపోతాయేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మోకాళ్ళ కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.

ఎంత ఎక్కువగా నడిస్తే అంత వేగంగా రక్త ప్రసరణ జరుగుతుంది గుర్తుంచుకోండి. అలానే కీళ్ళకు మంచి పోషణ కూడా అందుతుంది. మీరు కనుక మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతుంటే ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లెక్కి దిగడం చెయ్యకండి. అలానే ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద కూడా నడవకుండా ఉంటే మంచిది. నేల పై రెండు కాళ్లు మడత వేసుకొని కూర్చోవడం లాంటివి చేయకండి. బరువైన వస్తువులు కూడా ఎత్తకుండా ఉండండి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా రోజూ కొంతసేపు నడకకు సమయం కేటాయించడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు నిపుణులు. అంతే కాదండి క్రమక్రమంగా వాకింగ్ సమయాన్ని పెంచుతూ పోవడం ఉత్తమం. నొప్పి ఎక్కువగా ఉంటే ఉపశమనం కోసం గార్డులు, క్రేప్ బ్యాండేజ్ లు, చిన్న బ్రేసెస్ లాంటి కొన్ని ఉపకరణాలను ఆర్థోపెడిక్ నిపుణుల సూచనలని తీసుకుని అనుసరిస్తే మంచిది. ఇలా చేస్తే కొంచెం నొప్పులన్ని అదుపు లో ఉంచొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news