నైట్‌ చేతులు, కాళ్లు ఒకటే దురదపెడుతున్నాయా..? మీ కాలేయం డేంజర్లో ఉన్నట్లే..

-

చాలామందికి నైట్‌ నిద్రపోయేప్పుడు కాళ్లు, చేతులు ఒకటే దురద, మంటగా అనిపిస్తుంది. దీనివల్ల నైట్‌ సరిగ్గా నిద్రకూడా పట్టదు. బాడీ ఫ్రష్‌గా లేకపోవడం వల్లనో, రూం టెంపరేచర్‌ ఎక్కువగా ఉండటం వల్లనో ఇలా అనిపిస్తుంది అనుకుంటారు. కానీ దురదలు వస్తే అస్సు నిర్లక్ష్యం చేయకుండి. ఇది ఒక వ్యాధి లక్షణం అంటున్నారు వైద్యులు. కాలేయ వ్యాధి ఉండవచ్చు. ఇది ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఆకలి లేకపోవడం, అజీర్ణం, కాలేయం వాపు ,రాత్రి చేతులు ,కాళ్లలో దురద. ఇతర లక్షణాలు ఫ్యాటీ లివర్‌ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. రాత్రిపూట మీ చేతులు, కాళ్లలో దురద, ఎరుపుగా అనిపిస్తే మీ శరీరం హార్మోన్ల అసమతుల్యతను కలిగి ఉంటుంది. చాలా సార్లు అరచేతుల దురద రాత్రిపూట తీవ్రమవుతుంది. అవయవాలు కూడా వాపుగా మారుతాయి.

ఫ్యాటీ లివర్ లక్షణాలు.. ఆల్కహాల్ తీసుకునే వారిలోనే కాదు.. మద్యం తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్‌ సమస్య ఏర్పడవచ్చు. మద్యపానం చేయని వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు కొవ్వు కాలేయం ఏర్పడుతుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, అజాగ్రత్తలే వీటన్నింటికీ కారణం.

శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు, చర్మంపై చిన్న స్పైడర్ వెబ్ లాంటి కణాలు కనిపిస్తాయి. వీటిని వైద్య పరిభాషలో స్పైడర్ ఆంజియోమాస్ అంటారు. మీ శరీరంపై నీలిరంగు దద్దుర్లు వస్తే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

ఎలా నియంత్రించుకోవాలి..?

బరువును అదుపులో ఉంచుకోండి. అధిక బరువు ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది.
అధిక కేలరీల ఆహారాలు తినవద్దు. ఆహారం విషయంలో కంట్రోల్‌ అవసరం. ఇష్టమైనవి ఎప్పుడో ఒకసారి కానీ.. రోజు వద్దు.
అధిక సువాసన గల సబ్బును ఉపయోగించవద్దు. స్మెల్‌ ఎక్కువ వచ్చే సోప్స్‌, నురగ ఎక్కువ వచ్చే షాంపూలూ రెండూ మంచివి కావు.
గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
వదులుగా ఉండే బట్టలు ధరించండి. బిగుతుగా ఉండే బట్టల వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఎట్టిపరిస్థితుల్లో నైట్‌ జీన్స్‌తో నిద్రపోవద్దు.
దురద ఉన్న ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగండి. ఇలాంటి జాగ్రత్తలతో సమస్యను నివారించుకోవచ్చు.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news