గర్భాశయ క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలు.. క్యాన్సర్.. అడ్డుకునే మార్గాలు..

-

గర్భాశయ క్యాన్సర్..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. మొదటి స్టేజిలో ఈ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా కనిపించవు. చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మహిళల మరణాలకి కారణమవుతుంది. ఐతే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా మార్గాలున్నాయి. ముందుగా, పొగ తాగడం మానివేయాలి. సురక్షిత శృంగారం వంటివి ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.

సర్వైకల్ క్యాన్సర్ అంటే

గర్భాశయ కణాల్లో వ్యాపించే ఈ క్యాన్సర్ లైంగికంగా సంక్రమించే సంక్రమణ అయిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పివి) యొక్క వివిధ జాతుల కారణంగా ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది.

దీని లక్షణాలు

యోని నుండి రక్తం కారిపోవడం, శృంగార సమయంలో నొప్పి, కటి భాగంలో తీవ్రంగా నొప్పి ఉండడం.

లాన్సెట్ గ్లోబల్ అధ్యయనం ప్రకారం ఇండియాలో గర్భాశయ క్యాన్సర్ కారణంగా 2018లో ఎక్కువ మంది చనిపోయారు. మొత్త 97వేల మంది ఈ క్యాన్సర్ తో బాధపడుతుండగా 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..

పొగ తాగరాదు.. పొగ తాగడం వల్ల గర్భాశయ కణాల్లో ఈ క్యాన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంది.

పాప్ టెస్ట్

రెగ్యులర్ గా పాప్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. దానివల్ల మీ గర్భాశయంలో ఏదైనా అనుకోనిది అభివృద్ది చెందుతుందేమో తెలుసుకోవచ్చు.

వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.

సురక్షిత శృంగారం

ఒక్కరితో సురక్షిత పద్దతిలో శృంగారం మంచిది. అలా కాకుండా అసురక్షిత లైంగిక సంబంధాలను పెట్టుకోవద్దు.

మీరు తినే ఆహారాలను చూసుకోండి.

మీరేమీ తింటున్నారో, అది మీ ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో తెలుసుకోండి. అనారోగ్యాన్ని పెంపొందించే కొవ్వులు తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news