కాళ్ళు, చేతులు తిమ్మిరిలా..? సులభంగా బయటపడేసే మార్గాలు ఇవే..!

-

చాలామందికి కాళ్లు చేతులు ఎక్కువగా తిమ్మిరి ఎక్కుతూ ఉంటాయి. మీకు కూడా ఇలానే జరుగుతుందా..? శరీరంలో వివిధ భాగాల్లో తిమ్మిరి సాధారణంగా వస్తుంది. సరిగ్గా నిద్రపోకపోయినా కూర్చోక పోయినా కూడా ఈ సమస్య వస్తుంది. తరచూ తిమ్మిర్లు ఎక్కుతుంటే దానికి గల కారణాలు ఇవే అవ్వచ్చు మరిక ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం.

 

అధిక ఒత్తిడి వలన తిమ్మిర్లు ఎక్కచ్చు అలానే శ్రద్ధ లేకుండా పనిచేస్తే కూడా తిమ్మిర్లు ఎక్కుతాయి. ఒత్తిడి వలన నరాల బలహీనత ఏర్పడుతుంది ఇలా తిమ్మిరి కి దారి తీస్తుంది. కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కితే ఏ పని చేయలేము తిమ్మిరి వలన కాళ్లు చేతులు వణుకుతాయి కూడా. నరాల బలహీనత దీనికి కారణమని చెప్పొచ్చు.

తిమ్మిరి తగ్గాలంటే వ్యాయామం మెడిటేషన్ వంటి పద్ధతులు పాటిస్తే ఒత్తిడి దూరమవుతుంది ఒత్తిడి తగ్గితే తిమ్మిరి కూడా రాదు. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన కూడా ఈ సమస్య రావచ్చు. నరాల్లో రక్తం సరఫరా సరిగా అవ్వకపోవడంతో వెన్నెముకలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. వేగం తగ్గుతుంది దాంతో నరాల బలహీనత వస్తుంది.

పోషకాహారం తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తీసుకుంటే తిమ్మిరి సమస్య రాదు. ఖాళీగా ఎక్కువసేపు కూర్చోకండి. ఎక్కువ సేపు ఖాళీగా కూర్చోవడం వలన కూడా తిమ్మిరి వస్తుంది. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతే మంచిది. మిగిలిన ఎనిమిది గంటలు కూడా పని చేయండి.

మద్యపానం తీసుకుంటే కూడా ఈ సమస్య వస్తుంది అలానే ధూమపానానికి కూడా దూరంగా ఉండండి. శరీర బరువుని అదుపు లో ఉంచుకోండి. ఉప్పును తగ్గించండి. ఈ చిట్కాలు పాటిస్తే కూడా తిమ్మిరి రాదు. విటమిన్ బి తిమ్మిరి నుండి ఉపశమనం ఇస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ని తీసుకోండి. ఇలా వీటిని మీరు పాటిస్తూ ఉంటే తిమ్మిరి రాకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news