దాల్చిన చెక్క పొడితో కలిగే ప్రయోజనాలను చూద్దామా..!

-

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నోటీ దుర్వాసనతో పాటు సువాసన, రుచిని అందిస్తుంది. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. తిన్నప్పుడు తియ్యగా.. ఈ తర్వాత ఘాటును అందిస్తోంది. గరమ్ మసాలల్లో ఇది ప్రత్యేకం. దాల్చిన చెక్కను ఎక్కువగా బిర్యానీ, పలావు వంటి వంటకాల్లో దీన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. అయితే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

cinnamon
cinnamon

వంటకాల్లో దాల్చిన చెక్కను పక్కన పడేస్తున్నారా.. దీన్ని తినడం లేదా.. వంటల్లో ఘాటు వాసనను, తిన్నప్పుడు స్వీట్ నెస్ ను అందించే ఈ దాల్చిన చెక్క ఓన్లీ వంటలకే పరిమితం కాదు. టీ లేదా ఇతర పానీయాల్లో కూడా దాల్చిన చెక్కను వాడొచ్చు. దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

దాల్చిన చెక్కను వేరే దేశాల్లో మిరాకిల్ ఫుడ్ అని పిలుస్తారు. పరిగడపున రోజూ టీ స్పూన్ దాల్చిన చెక్కను వేడి నీళ్లలో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరానికి కావాల్సిన పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా లభిస్తాయి.

ప్రయోజనాలు :
దాల్చిన చెక్కను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రోజూ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ స్థాయిని తగ్గించి, నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తొందరగా అరిగేలా చేస్తుంది. శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు కణాల వృద్ధి, కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అలసటను దూరం చేసి రోజంతా యాక్టిక్ గా ఉండేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news