ఇంట్లోనే ఉంటూ ప్రోటీన్ షేక్ తయారు చేసుకోండిలా..!

-

ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. డబ్బు సంపాదించాలనే నెపంతో ఉద్యోగాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. వీరు పనిలో ఉన్నప్పుడు తినడానికి కూడా ఎంతో అశ్రద్ధ వహిస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మధ్యాహ్న భోజనం చేయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు. అయితే టిఫిన్స్, ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండుతుంది.. కొంత మేర శక్తి కూడా వస్తుంది. కానీ, ఫుల్ ఎనర్జీతో ఉండలేరు. అలాంటి సమయంలో శరీరానికి శక్తిని చేకూర్చే ప్రోటీన్ షేన్, మిల్క్ షేక్ వంటి ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి అందటంతోపాటు ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోగలుగుతారు. అయితే ప్రోటీన్ షేక్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. డబ్బులు వృథా చేసుకోవద్దని అనుకుంటే.. ఇంట్లోనే ఉంటూ ప్రోటీన్ షేక్‌లను తయారు చేసుకోవచ్చు. ఉదయం వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ షేక్ తీసుకుంటే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. అయితే ప్రోటీన్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి.. వాటి వల్ల ప్రయోజనాలను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

ప్రోటీన్ షేక్
ప్రోటీన్ షేక్

ప్రోటీన్ షేక్ తయారీ..
ప్రోటీన్ తయారు చేసుకోవాలని అనుకుంటే.. దానికి సంబంధించిన ఇంగ్రిడియన్స్‌ను సమకూర్చుకోవాలి. ఇంట్లోనే ఉంటూ చాలా సులభమైన పద్ధతుల్లో ప్రోటీన్ షేక్‌ను తయారు చేసుకోవచ్చు. మొదటగా డార్క్ చాక్టెల్, అరటితో ప్రోటీన్ షేక్ తయారీ గురించి తెలుసుకుందాం. దీనికి కావల్సిన పదార్థాలు.. ఒక అరటిపండు, 1 గ్లాసు పాలు, 1 టీస్పూన్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, 2 టీస్పూన్ డార్క్ చాక్లెట్లు తీసుకోవాలి. ముందుగా అరటి పండును తీసుకుని శుభ్రం చేసుకోవాలి. తొక్కను తొలగించుకుని అరటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ బౌల్‌లో వేసుకుని అందులో డార్క్ చాక్లెట్, చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ కలిపి మిక్సీలో వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మిక్సీ మూతను తెరిచి అందులో పాలు వేసుకుని మరో 5 నిమిషాలు గ్రైండింగ్ చేసుకోవాలి. ప్రోటీన్ షేక్ రెడీ అవుతుంది. ఒక గ్లాసులో తీసుకుని చల్లగా కావాలనుకుంటే ఐస్ ముక్కలు వేసుకుని ప్రోటీన్ షేక్ తాగేయవచ్చు.

ఉపయోగాలు..
బాడీ బిల్డింగ్ చేసే వారికి ప్రోటీన్ షేక్ చాలా ముఖ్యమైనది. రోజూ వ్యాయామం చేసేవాడికి ఇన్‌స్టంట్ ఎనర్జీ రావడానికి ప్రోటీన్ షేక్ తప్పనిసరిగా తాగాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసేటప్పుడు అధిక మొత్తంలో కేలరీలు ఖర్చు అవుతాయి. సరైన ఆహారం తీసుకోకపోయినప్పుడు శరీరం ఢీలా పడుతుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చి.. మరింత ఉత్సాహంగా ఉంటారని వాళ్లు తెలుపుతున్నారు. అందుకే వ్యాయామం చేసే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ప్రోటీన్ షేక్స్ తాగాలని వ్యాయామ నిపుణులు సూచనలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news