జీవన విధానంలో ఈ తప్పులు చేయడం వలన జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది..!

-

ఆరోగ్యం బాగుండాలంటే జీవన విధానం బాగుండాలి. మనం అనుసరించే పద్ధతులు, తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవి సరిగా లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే మన జీవన విధానంలో చేసే చిన్న చిన్న తప్పులు వల్ల జ్ఞాపక శక్తి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, పని విధానం ఇలా రోజు చేసే పనులన్నీ కూడా జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. డిప్రెషన్, ఫిజికల్ యాక్టివిటీ, హై బీపీ జ్ఞాపకశక్తిలో సమస్యలు తీసుకు వస్తాయి.

 

ఒకవేళ కనుక మీకు డిప్రెషన్ కానీ వ్యాయామం చేయక పోవడం కానీ హైబీపీ కానీ సమస్య ఉంటే జ్ఞాపక శక్తి మీకు సమస్యలు వస్తాయి. అయితే మెదడు ఆరోగ్యం కోసం జ్ఞాపక శక్తి సమస్యలు వంటివి లేకుండా ఉండటం కోసం ఈ తప్పులు చేయొద్దు. షుగరీ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవద్దు. షుగరీ డ్రింక్ ను తీసుకోవడం వల్ల డెమెన్షియా సమస్య వస్తుంది. పసుపు, కాఫీ వంటివి తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

కాఫీ తీసుకుంటే టెన్షన్ తగ్గుతుంది మరియు కాఫీ నిద్రని పెంపొందిస్తుంది అలాగే ఎక్కువ సేపు స్క్రీన్ల ముందు సమయాన్ని గడపడం వల్ల కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఎక్కువసేపు టీవీ, లాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ వంటి వాటితో సమయాన్ని గడుపుతుంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ఉండండి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. మంచి నిద్ర, పుస్తకాలు చదవడం, బ్రెయిన్ ఎక్షర్సైజస్ లాంటివి చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news