తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కు బెయిల్ మంజూరు. హై కోర్టులో బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినప్పటికీ లోకల్ కోట్ల మాత్రం ఆయనకు లభించింది. గురువారం అర్ధరాత్రి ఆయనను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఆయన నకిలీ బీకాం సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు పొందారని లోకాయుక్త ఆదేశంతో cid కేసు నమోదు చేసింది.
అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నారు కానీ కోర్టులో ప్రవేశ పెట్ట లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బెయిల్ అడిగారు. కానీ బెయిల్ ఇవ్వవద్దని ప్రాథమిక ఆధారాలను సమర్పించడానికి గడువు కావాలని cid తరపు లాయర్లు హైకోర్టును కోరారు.
దీంతో సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు కేసు పెట్టాలని ఆదేశించారు తను కూడా పార్టీగా చేర్చి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనూహ్యంగా రాత్రికి ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన అప్పుడే విడుదలయ్యారు. హై కోర్టులో బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉన్న కింది కోర్టులో బెయిల్ ఇవ్వడంతో దటీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.