ఆవాలు తినండి, జ్ఞాపకశక్తి పెంచుకోండి? అయితే.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకోండి!

-

కూరలోవేసుకొన్న ఆవాలు భోజనం చేసేటప్పుడు కూర రుచిని పెంచుతాయి. అలాగే ఆవాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిలో రకాలు కూడా ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆవాలులో రెండు రకాలున్నాయి. నలుపు ఆవాలు, తెలుపు ఆవాలు. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. నలుపు ఆవాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుపు ఆవాలు గురించి తెలుసుకుందాం. వీటితో ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. ఈ ఆవాల్లో డైటరీ ఫాట్స్, కార్బోహైడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు :
1. ఈ ఆవాలతో తయారుచేసిన నూనెను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలో న్యూటియన ఫాక్ట్స్ ఎక్కువ. చేపల కూరలో ఈ ఆవాలపొడి చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
2. ఆవాల పొడిని సలాడ్స్, సూప్స్ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడుతారు.
3. బెల్లంలో కొన్ని పల్లీలు, ఆవాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆపై వాటిని ఉండల్లా చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజుకు ఒకటి తీసుకుంటే.. ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చు.
4. ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది. ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.
5. 500 గ్రా. ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి, స్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే అస్తమా, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.
6. ఆవాల పొగిని కడుపు ప్రాంతంలో రాసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఎక్కువగా వాంతులు, నీల్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news