భార్యా భర్తలు కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటారు. ఏ గొడవ రాకుండా భార్య భర్తలు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటారు. పెళ్లయిన కొన్నాళ్లు సంతోషంగా వున్నా ఆ తర్వాత భార్యా భర్తల మధ్య గొడవలు మొదలవడం, మనశ్శాంతి లేకపోవడం ఇలా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మగవాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తపడాలి. మరి మగవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
కొంతమంది భర్తలు భార్యల ని తనకి నచ్చినట్లుగా మార్చుకోవాలి అనుకుంటారు. మొదట్లో బాగానే ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్ది కూడా ఇబ్బందికరంగా ఇది మారుతుంది. చాలా మంది భర్తలు పొదుపు విషయం లో మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఆదా చేస్తున్నామనుకుని భార్య చిన్న చిన్న కోరికల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. దాని వలన భార్యా భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి.
ఏ దాంపత్య జీవితం లో అయినా కూడా సంతోషం చాలా ముఖ్యం. వీలైనంత వరకు మీ భాగస్వామిని నవ్వించడానికి చూసుకోండి. అయితే పురుషుల తో పాటుగా స్త్రీలు కూడా ఈ విషయాన్ని పాటించాలి. ఇలా చేయడం వలన వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. లేకపోతే అనవసరంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి. దాంతో దాంపత్య జీవితం పాడవుతుంది. అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.