ఈ టీ తో రోగనిరోధకశక్తిని సులువుగా పెంపొందించుకోవచ్చు..!

-

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ మళ్లీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పద్ధతులు చూస్తున్నారు. అయితే ఈ రోజు మీ అందరి కోసం ఒక సులువైన పద్ధతి ఇక్కడ ఉంది. వీటిని మీరు తయారు చేసుకొని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని సులువుగా పెంపొందించుకోవచ్చు.

మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూడండి. దాల్చిన చెక్కలో నాచురల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. దాల్చిన చెక్క తో ఈ విధంగా మీరు టీ చేసుకుని తీసుకుంటే రోగనిరోధక శక్తి తో పాటు మరికొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

దాల్చిన చెక్క టీ తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా నీళ్లలో దాల్చినచెక్క వేసి మరిగించండి. ఆ తర్వాత దానిని వడకట్టి కొద్దిగా అల్లంని ముద్ద చేసి దానిలో వేయండి. ఫైనల్ గా ఇందులో తేనే లేదా నిమ్మరసం వేసి వేడిగా తీసుకోండి.

దాల్చిన చెక్క టీ వల్ల కలిగే లాభాలు:

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:

దాల్చిన చెక్క లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది తద్వారా కొవ్వు కరుగుతుంది. దీనితో మీరు బరువు తగ్గొచ్చు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు:

ఇది నిజంగా దివ్యౌషధమని చెప్పాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు,

బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు:

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తాయి.
అలానే గుండె సమస్యలను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.

పీరియడ్ క్రామ్ప్స్ నుండి రిలీఫ్ ఉంటుంది:

ఈ టీ ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో పీరియడ్ క్రామ్ప్స్ వలన వచ్చే నొప్పి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news