బెజవాడ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే వారికి వార్నింగ్

-

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట మరో వ్యక్తికి డ్రైవర్ కు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా… ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఏపీలో కేసులు 20 వేలకు పైగా నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news