సైలెంట్ కిల్లర్ హార్ట్ ఎటాక్.. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఆ ఈశ్వరునికే ఎరుక.. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్.. ఈ మూడూ వేర్వేరు పరిస్థితులు కానీ చాలా వరకు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్‌లు బాత్‌రూమ్‌లలోనే వస్తాయట. ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్‌రూమ్‌లో మల విసర్జన చేసినప్పుడు లేదా మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంపై ఒత్తిడి బాగా ఉంటే అప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుందని వైద్యులు అంటున్నారు..
కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై ఒత్తిడిని కలగజేస్తారు. అంటే ముక్కినట్లు చేస్తారు. దీని వల్ల వేగస్ నాడిపై ఒత్తిడి పడుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది.
కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు.. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. ఇది కూడా హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
కొందరు బెడ్ మీద నుంచి లేచి వెంటనే హడావిడిగా బాత్‌రూమ్‌కు పరుగెత్తుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగి అది హార్ట్ ఎటాక్‌ను కలగజేసేందుకు అవకాశం ఉంటుంది. బెడ్ మీద నుంచి లేచాక వెంటనే కిందకు దిగకూడదు. నెమ్మదిగా పనులు చేసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు. నిద్ర లేవగానే.. బెడ్ పైనుంచి కుర్చోనే.. ఒక కాలుని ఇంకో కాలుతో మసాజ్ లెక్క చేయాలి. ఇలా రాపిడి చేయడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. రాత్రంతా నిద్రపోయినప్పుడు బాడీ రిలాక్స్‌డ్ మోడ్‌లోకి వెళ్తుంది. మీరు ఇలా కాళ్లకు, అరచేతులను ఒకదానికి ఒకటి రుద్దుకుని ఆ వేడిని కళ్లకు పెడితే.. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.. కళ్లు నిద్రలేవగానే చాలా అలిసిపోయినట్లు, తెరవలేం.. ఇలా వేడి అంటించడం వల్ల కళ్లకు మంచి రిలాక్స్ అవుతుంది.