ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఇలా చెయ్యాల్సిందే..!

-

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చెయ్యగలం. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని టిప్స్ మీకోసం. వీటిని అనుసరిస్తే మరెంత ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. మరి వీటి వివరాల్లోకి వెళితే.. ప్రతీ రోజు వీలైనన్ని కూరగాయల్ని, పండ్లని తీసుకోవాలి. ప్లేటు లో కలర్‌ ఫుల్ వెజీలు ఉండేలా చూసుకోండి. పాలకూర, మెంతి, బీట్‌రూట్, టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ వగైరా కూరగాయలు తో పాటు వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, తులసి, ఏలకులు, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, పుదీనా వంటి వాటిని కూడా మీ ఆహారం లో ఉండేలా చూసుకోండి. వీటితో మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

తక్కువగా నూనెని వాడడం… బాదం, వాల్‌నట్, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పిస్తాలు, క్యారెట్‌ను అల్పాహారం కోసం తీసుకోవడం చెయ్యాలి. నిత్యం బజ్రా, జోవర్, రాగి, ఇతర మిల్లెట్లు, వోట్స్ వంటి తృణధాన్యాలు తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు, చేపలు, లీన్ మటన్‌, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, సోయా బీన్, పప్పు ధాన్యాలు కూడా మీ డైట్ లో చేర్చాలి. అంతే కాదండి మజిల్ మాస్‌ను కాపాడటానికి ఉసిరి, జామ, నారింజ, స్ట్రాబెర్రీ, కివి, విటమిన్ సీ లభించే పండ్లు తినాలి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

భోజనం సమయం లో కాకుండా రోజంతా కొంచెం వేడి చేసిన నీటిని తాగుతుండటం చెయ్యాలి. వేపుడ్లని కూడా మానేయాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా చూసుకోవాలి. అలానే మంచి ఆరోగ్యం కోసం ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించాలి. ప్రాణాయామం చెయ్యడం కూడా మంచిదే. ఇలా కనుక అనుసరిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news