ప్రస్తుత సమాజంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త మందు కనిపెట్టారు. దాని పేరు సీడీకే 4/6. ఇది తీవ్రమైన హెచ్‌ఈఆర్ 2 క్యాన్సర్ కణాలను కూడా వ్యాపించకుండా, కణితులు పెరగకుండా పట్టి ఉంచుతుంది.
ఈ మందు తయారీ కోసం శాస్త్రవేత్తలు కృత్రిమ కణజాలాలపై పరిశోధనలు నిర్వహించారు. కణజాలాలపై కేన్సర్ కణాలు దాడి చేసినప్పుడు కణితి ఏర్పడే రీతుల్లో మార్పులను బట్టి మందును కనిపెట్టారు. అంతే కాకుండా ఇది వ్యాధి నిరోధకతను కూడా పెంచుతుంది. బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌ను అడ్డుకొంటుంది.